17 August, 2026 | 2:59 AM

తుంగతుర్తిలో బోనమెత్తిన మహిళలు

17-08-2026 02:13 AM

ముత్యాలమ్మ గుడి దగ్గర ప్రత్యేక మొక్కులు

తుంగతుర్తి, ఆగస్టు 16 : బోనాల పండుగను పురస్కరించుకొని తుంగతుర్తి మండల కేంద్రంలో పాటు మండల పరిధిలోని గ్రామపంచాయతీల లో వేకుమజామున మహిళలు నిద్రలేచి తనంటే స్థానమాచరించి, నూతన వస్త్రాలు, నైవేద్యాలు తయారు చేసుకొని, కొత్తకుండకు బొట్లు పెట్టి, బోనం తయారు చేసుకుని, నెత్తిలో పెట్టుకొని దీపాలు వెలిగించి, ముత్యాలమ్మ గుడికి వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించి, జంతుబలి నిర్వహించి, కుటుంబ సభ్యులుఆరోగ్యంగా ,ఆర్థికంగా, ఉండాలని, రైతులకు పంటలు పండాలని కోరుతూ, అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు.