యూఏఈలో మహిళల ఆసియాకప్
05-08-2026 12:00 AM
దుబాయి, ఆగస్టు 4 : మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నీ యూఏఈ వేదికగా జరగనుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తన సభ్యదేశాలకు సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. ఈ టోర్నీ ఆగస్టు 28 నుం చి సెప్టెంబర్ 13 వరకు జరిగే అవకాశం ఉం దని సమాచారం. మ్యాచులు, వేదికలకు సం బంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయనున్నారు.
భారత్, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేసి యా, థాయ్‌లాండ్, యూఏఈ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. ఈ మెగాటోర్నీలో భారత్, పాక్ మ్యాచ్‌పైనే అందరి చూపు నెలకొంది. టోర్నీ వేదికకు సంబంధించిన తుది నిర్ణయం, పరిపాలనా అనుమతులు పూర్తికాకపోవడంతో షెడ్యూల్ విడుదలకు కారణం.






