కామన్‌వెల్త్ గేమ్స్ విజేతలకు సత్కారం
05-08-2026 12:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 4 : కామన్‌వెల్త్ గేమ్స్ లో పతకాలు గెలిచిన భారత క్రీడాకారులను కేంద్ర క్రీడాశాఖ ఘనంగా సత్కరించింది. క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వారిని అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు. స్వర్ణ పతక విజేతలకు రూ.30 లక్షలు, రజతానికి రూ.20 లక్షలు, కాంస్య ప తక విజేతలకు రూ.10 లక్షల చొప్పున నగరు ప్రోత్సాహకాలు అందించారు.
ఈ సందర్భంగా ప్రతీ ఒక్క అథ్లెట్‌తో ప్రత్యేకంగా మాట్లాడి వారికి అభినందనలు తెలిపారు. వచ్చే ఆసియా క్రీడల్లో సైతం ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకానికి రూ.36 వేల కో ట్లు కేటాయించిందని చెప్పారు. పారా అథ్లె ట్లు ఆయనకు ప్రత్యేక జెర్సీని అందజేశారు.






