19 March, 2026 | 4:14 AM

విభిన్న పాత్రలతో..

19-03-2026 12:00 AM

మార్చి 19న టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు పుట్టినరోజు. 1975లో సినీ కెరీర్‌ను ఆరంభించిన మోహన్‌బాబు ఇప్పటికీ దిగ్విజయంగా దూసుకుపోతున్నారు. సినీ పరిశ్రమలో ఆయన అడుగుపెట్టి ఇటీవలే యాభై ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. కుర్ర హీరోలు, యంగ్ జనరేషన్‌తో పోటీ పడుతూ మరీ మోహన్‌బాబు నటిస్తున్నారు. ఒకప్పుడు విలన్‌గా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన మోహన్‌బాబు ఇప్పుడు విభిన్న పాత్ర లతో సినీప్రియులను మెప్పించనున్నారు.

ఈ ఏడాది ‘ది ప్యార డైజ్’, ‘శ్రీనివాస మంగాపురం’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ పాత్రలు నేటి తరాన్ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ సిని మాలోని శికంజా మాలిక్ పాత్రలో మోహన్‌బాబు లుక్‌కు మంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, నటుడిగా మోహన్‌బాబు అందించిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.