19 March, 2026 | 5:13 AM

శర్వా సరసన..

19-03-2026 12:00 AM

స్టార్ హీరో శర్వానంద్ ప్రస్తుతం దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ సినిమాతో బిజీగా ఉన్నారు. శర్వా కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సూపర్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడీ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా.. శర్వా మరో చిత్రానికి సిద్ధయ్యారు. ఆయన తర్వాతి సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో రానుంది. క్లీన్ ఎంటర్‌టైనర్, సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందనుంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకొంటున్న ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జులై నుంచి  ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. 2027 సంక్రాంతి లక్ష్యంగా ఈ సినిమా పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇదిలావుండగా, ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త వినవస్తోంది. ఇందులో ఫీమేల్ లీడ్ కోసం టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దేను సంప్రదించారని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. చర్చలు ఫలించి, అన్నీ అనుకున్నట్టు కుదిరితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.