26 April, 2026 | 3:34 AM

కమలం పార్టీలో.. మహిళా శక్తి పెరిగేనా?

26-04-2026 01:56 AM
  1. కేంద్ర క్యాబినెట్ విస్తరణలో తగిన ప్రాతినిథ్యం లభిస్తుందా? 
  2. పార్టీ సంస్థాగతంగా తగిన వాటా ఇచ్చేనా!

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): దేశంలో 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రచి స్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నాయకత్వం మరింత దూకుడుగా వ్యవహరించనుంది. పార్టీ సంస్థాగతంగా కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకు పార్టీ లో పలు సంస్కరణలను చేపట్టనుంది. రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది.

అలాగే పాలనలోనూ మరింత వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర క్యాబినెట్ విస్తరణను కూడా చేపట్టే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, కేరళం, పుదుచ్చేరి, అసోం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఇక ఆయా రాష్ట్రాల ఫలితాలను బట్టి బీజేపీ నాయకత్వం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలకు నడుం కట్టనుంది. ఓటర్లను ప్రభావితం చేయగల.. చరిష్మా ఉన్న నాయకులను రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగిం చడం ఇందులో మొదటిది.

రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఉన్న పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను గుర్తించి వారికి మిగతా రాష్ట్రాల్లోనూ బాధ్యతలు అప్పగించడం రెండవది. తద్వారా వారి సేవలను పార్టీ పూర్తిగా ఉపయోగించుకోనుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఈసారి కొత్తవారికి చోటు కల్పించే వీలుంది. అప్పుడు ముఖ్యంగా దక్షిణాది నుంచి మహిళా నాయకుల సంఖ్యను పెంచే ఆస్కారముంది. పార్టీలో వచ్చే ఎన్నికల నాటికి పెద్దసంఖ్యలో మహిళా నాయకత్వం ఉండేలా పార్టీ నాయకత్వం తగిన చర్యలు తీసుకోవడం అనివార్యం అవుతుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలనుకున్న ఎన్‌డీఏకు ఇటీవల పార్లమెంట్‌లో ఎదురుదెబ్బ తగ లింది. అయితే 33 శాతం రిజర్వేషన్‌ను పార్టీలోనైనా అమలుచేసి తమ పార్టీ.. మహిళల సాధికారికతకు అనుకూలమనే సంకేతాలిచ్చేలా పార్టీలోనూ, అవసరమైతే క్యాబినెట్‌లోనూ దక్షిణాది నుంచి మహిళలకు చోటు కల్పించే అవకాశాలను జాతీయ నాయకత్వం పరిశీలిస్తోంది. 

మహిళా ప్రాతినిథ్యం..

కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టాలంటే బీజేపీ అటు పార్టీలోనూ ఇటు కేంద్ర క్యాబినెట్‌లోనూ మహిళా ప్రాతినిథ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. ఇందుకు దక్షిణాదిపైనే బీజేపీ ఎక్కువ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇండీ కూటమి డీలిమిటేషన్ ద్వారా దక్షిణానికి అన్యాయం చేస్తున్నారనే వాయిస్‌ను బలంగా వినిపించింది. దీన్ని అధిగమించాలంటే మహిళ లకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఇదే జరిగితే దక్షిణాది నుంచి మహిళల కు జాతీయ నాయకత్వంలో మరిన్ని అవకాశాలు దక్కుతాయి. 2024లో 14 పార్టీల నుంచి మహిళా లోక్‌సభ ఎంపీలు ఎన్నికయ్యారు. ఈ జాబితాలో 31 మంది మహిళా ఎంపీలతో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా, కాంగ్రెస్(13), టీఎంసీ(11), ఎస్‌పీ (3), చిరా గ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీఆర్‌వీ, జేడీ(యూ) నుంచి ఇద్దరు ఉన్నారు. మిగిలిన మరో ఏడు పార్టీలకు ఒక్కో మహిళా ఎంపీ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి బీజే పీ ఎంపీలుగా దగ్గుబాటి పురందేశ్వరీ, డీకే అ రుణ ఉన్నారు. టీడీపీ మహిళా ఎంపీగా నం ద్యాల నుంచి బైరెడ్డి శబరీ గెలుపొందారు. 

ఏడుగురే మంత్రులు..

మోదీ 3.0 క్యాబినెట్‌లో ఏడుగురే మహి ళా మంత్రులు ఉన్నారు. వారు నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖాడ్సే, సావిత్రి ఠాకూర్, నిమూబెన్ బాంబనియా, అనుప్రియా పటేల్. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. ఇందులో దేశవ్యాప్తంగా 74 మంది మహిళా ఎంపీలున్నారు. లోక్‌సభ సీట్లలో వీరి శాతం కేవలం 13.63 శాతంగా ఉంది. మహిళలకు రిజర్వ్ చేసిన 33 శాతం కంటే ఇది చాలా తక్కువగా ఉం ది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళా ఎంపీలు కాగా, 2024 ఎన్నికల్లో నలుగురు ఎంపీలు తగ్గారు.