18 July, 2026 | 11:04 AM

బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం

18-07-2026 10:46 AM

ఉపాధ్యాయులు ఉన్న.. విద్యార్థుల సంఖ్య సున్నా కథనానికి విశేష స్పందన.

సర్పంచ్ కొరుకుప్పల నరేష్ గౌడ్

తుంగతుర్తి (విజయక్రాంతి): బండ రామారం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచుటకు, గ్రామస్తులమంతా కృషి చేస్తామని, ఉపాధ్యాయ బృందం ఐకమత్యంతో పని చేయాలని స్థానిక సర్పంచ్ కొరికొప్పుల నరేష్ గౌడ్ అన్నారు. విజయ క్రాంతి దినపత్రికలో శుక్రవారం రోజున ఉపాధ్యాయులు ఉన్న.. విద్యార్థుల సంఖ్య సున్నా కథనానికి విశేష స్పందనతో ,శనివారం బండ రామారం సర్పంచ్ ,ఉప సర్పంచ్, గ్రామ పెద్దల సహకారంతో, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటింటికి తిరిగి, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలకు తిరిగి 9 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలుగా, పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ మధ్య సఖ్యత లోపించదని దీని కారణంగానే, పరిస్థితులు టీసీలు ఇవ్వడానికి దారితీసిందని, సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై డిఈఓ కు వినతి పత్రం అందజేశామని తెలుపుతూ, గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు రాజకీయాలకతీతంగా పాలుపంచుకొని, పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరపున ఎల్లవేళలా సాయ శాఖ అందిస్తామని తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య ముద్దుబిడ్డ గ్రామ పెద్ద తాటికొండ సీతయ్య విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు అందిస్తామని ప్రకటించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోడేటి యాదగిరి, ఆర్యవైశ్య రాష్ట్ర రాజకీయ వైస్ చైర్మన్ తాటికొండ సీతయ్య, ఉపాధ్యాయులు కోటయ్య, శ్రీనివాస్, నరేష్ లింగన్న మహేందర్ లింగస్వామి, రాజు ,వెంకన్న, విద్యార్థులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.