18 July, 2026 | 12:22 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం

26-04-2026 01:55 AM

హైదరాబాద్ వేదికగా రెండ్రోజుల సదస్సు విజయవంతం

హైదరాబాద్, ఏప్రిల్ 25: దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సంక్షేమమే ధ్యేయంగా నేషనల్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ) జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించ బడ్డాయి. సంస్థ జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ రెండ్రోజుల సదస్సులో జర్నలిస్టుల భద్రత, హక్కుల సాధనపై కీలక తీర్మానాలు చేశారు.

ఈ సమావేశాలలో ప్రధాన ఆకర్షణగా ‘తెలంగాణ రైజింగ్‘ అంశం నిలిచింది. ఈ సెషన్లో హాజరైన ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన జాతీయ స్థాయి జర్నలిస్టులకు తెలంగాణ అభివృద్ధి నమూనాను సమగ్రంగా వివరించారు. సమాస్థ జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ’జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్’ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వేతన బోర్డుల ఏర్పాటు, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు గుర్తింపు వంటి అంశాలపై తీర్మా నాలు ఆమోదించారు. ఈ రెండు రోజుల సదస్సు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని నేతృత్వంలో జరుగగా సంస్థ ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో  టీపీసీసీ ఉపాద్యక్షురాలు  హనూమాండ్ల ఝాన్సీ, వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆయూబ్, డెమాక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు వివేక్, సామాజిక వేత్త కరాటే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జిల్లాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.