18 July, 2026 | 10:25 AM

వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు

18-07-2026 10:07 AM

పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, సిబ్బంది 

ఆలయ విశిష్టతను వివరించిన అడిషనల్ కలెక్టర్ నగేష్ 

పాపన్నపేట,జులై18: దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. మంజీరా 'ఏడు' పాయలుగా చీలి ప్రవహించే ప్రసిద్ధ ప్రాంతంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాతను(Edupayala Vana Durga Bhavani) ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు(Manchu Vishnu) శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, సిబ్బంది, మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్(Medak Additional Collector Nagesh) పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది వారిని ఘనంగా సత్కరించారు. అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆలయ విశిష్టతను మంచు విష్ణుకు వివరించారు. ఆయన వెంట దేవస్థానం సిబ్బంది, టూరిజం శాఖ సిబ్బంది, స్థానిక పోలీసులు తదితరులు ఉన్నారు.