18 July, 2026 | 10:16 AM

సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు

18-07-2026 10:03 AM

సోనమ్ వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నం..

ఆస్పత్రికి తరలించిన పోలీసులు..

21 రోజులుగా దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌..

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు డిమాండ్‌

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌(Sonam Wangchuk Hospitalised) దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. వాంగ్‌చుక్‌ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 21 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో వాంగ్ చుక్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేంద్రమంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వ్యతిరేకంగా సోమన్ నిరాహార దీక్షకు దిగారు. కాక్రోజ్ జనతా పార్టీ నిరసనల్లో భాగంగా 21 రోజులుగా సోనమ్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం, విద్యావ్యవస్థలో అవకతవకలపై దీక్షకు పూనుకున్నారు. వాంగ్ చుక్ జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు.

వాంగ్‌చుక్ కు ఎటువంటి చికిత్స చేయకూడదు: ఆయన భార్య గీతాంజలి జె. అంగ్మో

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారని ఆయన భార్య గీతాంజలి జె. అంగ్మో శనివారం తెలిపారు. తన అనుమతి లేకుండా ఆయనకు ఎటువంటి వైద్య చికిత్స అందించకూడదని ఆమె స్పష్టం చేశారు. తన నిరవధిక నిరాహార దీక్షకు 21వ రోజైన శనివారం తెల్లవారుజామున, జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసన స్థలం నుంచి వాంగ్‌చుక్‌ను తరలించారు. "అతను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉన్నాడు. నా అనుమతి లేకుండా ఎలాంటి చికిత్స ప్రారంభించవద్దని నేను వారికి సూచించాను. ఏమైనా జరిగితే ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేస్తాను," అని ఆంగ్మో  మీడియాకి తెలిపారు.