యూనిఫామ్ అందేనా?
11-06-2026 12:49 AM
జిల్లాలకు చేరని క్లాత్
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ఇంకో నాలుగు రోజులైతే పాఠశాలలు తెరుచుకుంటాయి. బడిగంట మోగుతోంది. అయితే ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు సకాలంలో యూనిఫామ్ అందే పరిస్థితి కనిపించడంలేదు. యూనిఫామ్‌లకు సంబంధించిన క్లాత్ ఇప్పటివరకూ చాలా జిల్లాలకు చేరలేదని సమాచారం. మహిళా సంఘాలు పాఠశాలలకు వచ్చి ఇప్ప టికే విద్యార్థుల కొలతలు తీసుకొని వెళ్లారు.
వారికి క్లాత్ అందజేస్తే కుట్టేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. కానీ ఇంతవరకూ క్లాత్ వారికి అందని పరిస్థితి. ఇదిలా ఉంటే ఈ నెల 15వ తేదీ వరకు విద్యార్థులకు పంపిణీ చేసే నోట్ బుక్స్ మం డల కేంద్రాల నుంచి స్కూళ్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని విద్యాధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.






