ముఖ్యమంత్రి పర్యటనలోగా రోడ్డు పూర్తయ్యేనా..?
- నిధులు ఉన్న పనులు తీసుకున్నందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు..
- ఖజానాల్లో మూలుగుతున్న నిధులు..
- ఈనెల 20న ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు, ప్రజా ప్రతినిధుల ఆశాభావం..
- నేడే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హీరాపూర్ లో గ్రామసభ..
ఉట్నూర్, మే3( విజయ క్రాంతి ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ లో పర్యటిస్తారని స మాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలోగా ఇంద్రవెల్లి మండల కేంద్రం నుండి లాల్ టెకిడి వరకు గల తారు రోడ్డు పనులు పూర్తి అవుతాయా లేదా అన్న అనుమానాలు గిరిజనులు కలుగుతుంది. 1996 -97 అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ప్రస్తుత ఎంపీ గోడం నగేష్ ఇంద్రవెల్లి మండల కేంద్రం నుండి దస్నాపూర్ వరకు బీటీ రోడ్డు మంజూరు చేసి పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.
బీటీ రోడ్ నిర్మించినప్పటి నుండి తారు రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదు. 2005 జరిగిన ఎన్నికల్లో బోథ్ ఎమ్మెల్యేగా సోయం బాపూరావు విజ యం సాధించిన తర్వాత బీటీ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. తరువాత ప్రజల ఓట్లతో గెలుపొందిన ఈ రో డ్డును పట్టించుకోలేదు. నిధులు మంజూరు చేయించలేదు. దీంతో గుంతల రోడ్డులో ప్రజలు నాన్న వసూలు పడుతున్న విషయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక శ్రద్ధతో ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో గుంతల మయమైన బీటీ రోడ్ల మరమ్మతులకు . 36.95 కోట్లు మంజూరు చేయించారు.
దాదాపు రెండేళ్లు పూర్తి అవుతున్న మంజూరైన నిధులకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నాలుగు సార్లు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు పనులు తీసుకున్నందుకు ముందుకు రావడం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రోడ్డు పనులు పక్షం రోజుల్లో పూర్తి అయ్యేనా లేదా అని గిరిజనులు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ముందు బీటీ రోడ్ పనులు పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు..
పనులు తీసుకునేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు..
గత బీ ఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో పనులు చేసినా కాంట్రాక్టర్లకు ఏళ్ల తరబడి బిల్లు రావడంలేదని, ఈ ప్రభుత్వంలో మంజూరు చేసిన పనులను తీసుకుంటే ఈ బిల్లుల సైతం చేతికి రావని గుర్తించిన కాంట్రాక్టర్లు పనులు తీసుకున్నందుకు ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యేగా వెడ్మ బొజ్జు పటేల్ విజయం సాధించిన తర్వాత ముందుగా ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో . 36.95 కోట్లు మంజూరు చేయించారు.
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు టెండర్లు పిలిచిన ఒక్క కాంట్రాక్టర్ సైతం టెండర్లు దాఖలు చేయలేదు. కొంతమంది కాంట్రాక్టర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన పనులకు నేటికీ బిల్లులు రాలేదని, చేసిన అప్పులు తీర్చలేక తమ వద్ద ఉన్న ఆస్తులను బ్యాంకుల్లో గిరివి పెట్టి డబ్బులు తీసుకొని నువ్వు పనులు చేసిన ఆ డబ్బులు సైతం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో పిలిచే టెండర్లలో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి టెండర్లలో పనులు తీసుకొని పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
* నేడే హీరాపూర్ గ్రామసభ..
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలలో పర్యటిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఐ టి డి ఏ పి ఓ జనరల్ వసంతరావు జాదవ్, డిడి అంబాజీ జాదవ్, ఏపీవో పి వి టి జి ఆత్రం భాస్కర్ లు హీరాపూర్ గ్రామాన్ని సందర్శించి సర్పంచ్ తొడసం లక్ష్మీబాయి తో పాటు గ్రామస్తులతో గ్రామసభ ఏర్పాటు పై చర్చించారు. గ్రామంలోని సమస్యలతో పాటు గిరిజనుల సమస్యలను సైతం అధికారులు తెలుసుకున్నారు..
సీఎం పర్యటనతో రూపు రేఖలు మారనున్న గోండు పల్లెలు..
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2021 ఏప్రిల్ 20న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హోదాలో హీరాపుర్ గ్రామాన్ని సందర్శించి అక్కడి గిరిజనులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడి ఆదివాసి మహిళలతో గిరిజనులో వంటకాలను రుచి చూశారు.
ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం హోదాలో మరోసారి హీరాపూర్ గ్రామానికి స్వయంగా వచ్చి ఇంద్రవెల్లి మండలంలోని అన్ని గ్రామాల సమస్యలతోపాటు సిరికొండ, ఇచ్చోడా, ఉట్నూర్, ఆదిలాబాద్ రూరల్, తదితర మండలాల సమస్యలతో పాటు దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ సాగునీటి వసతి కల్పించుటకు చర్యలు తీసుకుంటానని గిరిజనులకు హామీ ఇచ్చారు..
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ 6న ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో పాటు మాజీ ఎంపీ సోయం బాపురావును స్వయంగా పిలిచి హీరాపూర్ గ్రామంలో మే నెలలో పర్యటిస్తారని , అక్కడి ఉన్న సమస్యలను గ్రామస్తులతో చర్చించి తనకు నివేదికలు ఇవ్వాలని సూచనలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే, మాజీ ఎంపీ లు హీరాపూర్ గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన గ్రామాల పటేళ్లు, రాయి సెంటర్ల సార్ మేడిలు గిరిజన నాయకులు ప్రస్తావించిన అంశాలను సేకరించారు. గ్రామాల్లో సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నివేదిక రూపంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపురావు లు అందజేశారు.






