2 July, 2026 | 10:51 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

సన్ డే.. ఎండా వేడితో ప్రజలు బెంబేలు

04-05-2026 02:23 AM

నిర్మల్ మే 3 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆదివారం సూర్యుడు మండిపోయారు. రికార్డ్ స్థాయిలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ఎండకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఎండలు పెరుగుతూ మధ్యాహ్నం నిప్పుల కొలిమిగా మండిపోతున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు వేడి గాలులు వేయడంతో మధ్యాహ్నం పూట రోడ్లన్నీ జనం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

అత్యవసర పరిస్థితులు బయటకు వస్తే జనాలు గొడుగులు, తలకు రుమాలు టోపీలు పెట్టుకుని బయటకు వస్తున్నారు. చల్లని పానీయాలను తాగుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే రైతులు కూలి పనులు చేసే కార్మికులు ఎండా వేడిమి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. రోడ్లపై చిరు వ్యాపారం చేసేవారు వ్యాపారం లేక ఇబ్బందికి గురవుతున్నారు.