వన్యప్రాణులకు రక్షణ కరువు!
వేటగాళ్ల వలలో చిక్కుకొని అడవి జంతు వుల విలవిల..
జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో జోరుగా వేట
ఉచ్చులు, విద్యుత్ వైర్లను వినియోగిస్తు న్న వైనం
గుట్టుచప్పుడు కాకుండా చర్మం, మాంసం విక్రయాలు
రక్షణ చర్యలు చేపట్టడంలో యంత్రాంగం నిర్లక్ష్యం
మణుగూరు, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవులు ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు. ఇలాం టి అడవులలో జన జీవనానికి దూరంగా అభయారణ్యంలో తలదాచుకునే వన్య ప్రాణులకు రక్షణ కరువు అవుతుంది. వేసవి కావడంతో అటవీ ప్రాంతంలో తాగునీటి కోసం ఆరాటపడుతుంటాయి. వాగులు, గోదావరి, నీటి లభ్యత ప్రదేశాల్లో దాహార్తి తీర్చుకోవడానికి తరలివస్తా యి. ఇదే అదనుగా వేటగాళ్లు మాటువేసి వేటాడుతున్నారు.
ఈ మూగజీవాల కోసం సంరక్షణ చట్టాలున్నా, స్వార్థపరులకు అవి చుట్టాలవుతున్నాయి. ఫలితంగా జింకలు, దుప్పులు అడవి పందులు వారి ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతు న్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈ అక్రమం స్వేచ్ఛగా..యథేచ్ఛగా సాగుతుండటం కలవరానికి గురి చేస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వన్యప్రా ణుల వేటఫై విజయ క్రాంతి కథనం...
మాంసం కోసం అడ్డగోలుగా వేట..
అడవులలో స్వేచ్ఛగా సంచరించాల్సిన వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడి మాంసాహార ప్రియులకు విందు భోజనంగా మారుతున్నాయి. ముఖ్యంగా పినపా క నియోజకవర్గంలో ఆళ్లపల్లి, గుండాల, పినపాక, మణుగూరు, కరకగూడెంలలో మండలాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో అడవి జంతువుల ఉనికి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదే అదు నుగా చూసుకొని వేటగాళ్లు అడవిలో నీటి లభ్యత ఉన్నచోట, అడవి జంతువుల మార్గాలను పసిగట్టి ఉచ్చులు ఏర్పాటు చేయడం, అడవిలో కరెంటును ఆసరాగా చేసుకుని ఇనుప తీగలతో కరెంట్ ఉచ్చులను బిగించడం వంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు.
అందులో చిక్కిన అడవి జంతువులను చంపి మాంసాన్ని గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తూ వన్యప్రాణుల మను గడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.అడ వికి చుట్టుపక్కల ఉన్న రైతులు పంటల ను కాపాడుకునే క్రమంలో చుట్టూ తీగలను అమర్చి కరెంటు బిగించడం వల్ల మరి కొన్ని అటవీ జీవాలు మృత్యువాత పడు తున్నాయి.
అటవీ శాఖ అధికారులకు పట్టదా..?
అడవుల పరిరక్షణలో కీలకపాత్ర పోషించే అటవీశాఖ సిబ్బంది వన్యప్రాణాల సంరక్షణలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. వేటగాళ్ల ఉచ్చుకు అడవి పందులు, నెమళ్లు, జింకలు కూడా బలవుతున్నట్లు సమాచారం. ఇలా వేటగాళ్ల అగడాలు రోజు రోజుకు మితిమీరిపొతుండగా మరోవైపు కొంతమంది అటవీ సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తూ చూసీ చూడన ట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది.
వేటగాళ్లపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. దీంతో వన్య ప్రాణి సంరక్షణ చట్టం కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. ఒకవైపు పోడు వ్యవసాయం మూలంగా అడవులు అంతరించి పోతుండడం, మరోవైపు వేట గాళ్ల వల్ల అటవీ క్షీణత వల్ల వన్య ప్రాణు లు కనుమరుగవుతున్నాయి. ఇలా రోజు రోజుకూ వన్యప్రాణుల సంఖ్య తగ్గుతుం డడం కలవరానికి గురి చేస్తున్నది.
రక్షణ చర్యలు అవసరం..
అడవిలో ఉండే వన్యప్రాణులకు రానురాను మనుషుల నుంచి రక్షణ లేకుండా పోవడంతో అడవుల్లో వన్యప్రాణుల కోసం రక్షణ చర్యలు చేపట్టాలని డిమాం డ్ వినిపిస్తోంది. ఏజెన్సీ మండలాలలోని అడవి ప్రాంతంలో ఎక్కువగా వేటగాళ్ల చేతిలో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అడవులలో అక్కడక్కడ కెమెరా ట్రాప్పులు, రాత్రిపూట ఫారెస్ట్ అధికారుల గస్తీ వంటి భద్రతా చర్యలు తీసుకోవడం వల్ల కొంత మేర అడవిలో వేట తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి.
అడవి జంతు వులను హతమార్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల మిగతావారు అడవిలోకి వెళ్లేందుకు భయపడతారనే వాదన సైతం ప్రజల నుంచి వినిపిస్తోంది. ఏది ఏమైనా అడవిలోని వన్యప్రాణులను కాపాడుకోవడం మన బాధ్యతగా భావిం చి అటవీ జంతువులు అంతరించిపోకుం డా కాపాడుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
వేటగాళ్లపై నిఘా ఉంచి.. కేసులు నమోదు చేస్తాం
అటవీ ప్రాంతంలో ఉండే వన్యప్రాణులను వేటాడి చంపే వేటగాళ్లపై నిఘా ఉంచాం. గ్రామాల వారీగా వేటగాళ్ల వివరాలను సేకరిస్తున్నాం. ముఖ్యంగా కరెంట్తో వన్యప్రాణులను చంపే వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టాం. నిందితులు ఎటువంటి వారైనా కేసులు నమోదు చేస్తాం.




