భర్తను హత్య చేసిన భార్య
- మొదట డాబా పైనుంచి తోసేసి..
- స్లున్‌లోకి టాయిలెట్ క్లీనర్ హార్పిక్ ఎక్కించి..
- వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకం
- నిజామాబాద్ జిల్లా న్యాలకల్‌లో ఘటన
నిజామాబాద్, జూలై 6(విజయక్రాంతి): వివాహాయేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య తన భర్తను అంతమొందించింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా న్యాలకల్ గ్రామంలో సోమవారం సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు న్యాలకల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ ఇటీవల గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అతన్ని అదే గ్రామానికి చెందిన వెంకటసాయి అలియాస్ బంటి మద్యం సేవించేందుకు తీసుకెళ్లాడు.
అనంతరం సంధ్య, బంటి కలిసి తన భర్త ప్రశాంత్‌ను అపస్మారక స్థితికి చేర్చారు. ఆ తర్వాత అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అక్కడ ప్రశాంత్ శరీరంలోని సరాల్లో టాయిలెట్ క్లీన్ చేసేందుకు ఉపయోగించే హార్చిక్ లిక్విడ్ ఎక్కించి హత్య చేశారు. సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, తమ వివాహేతర సంబంధా నికి అడ్డుగా ఉన్నాడనే సంధ్య తన భర్తను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో సంధ్య, అనిల్, వెంకటసాయి అలియాస్ బంటిలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియుడి మోజులో పడి భార్య సంధ్య భర్తను హత్య చేయడం కలకలం రేపుతుంది.






