24 July, 2026 | 3:01 AM

చీర కోసం భర్తను చంపిన భార్య

24-07-2026 01:53 AM
  1. కుక్కర్‌తో కొట్టి, గొంతు నులిమి హత్య
  2. నిందితురాలిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు

ముంబై, జూలై 23: తనకు చీర కొనివ్వలేదన్న కోపంతో భర్తను కుక్కర్ మూతతో బాది, గొంతు నులిమి చంపేసింది ఓ భార్య. సంచలనం సృష్టించిన ఈ ఘటన ముంబైలోని ఠాణెలో శనివారం జరగగా ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. ఠాణె పోలీసులు వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు. ఠాణె శివా రులోని బద్లాపూర్ ఈస్ట్‌లో హరేరామ్, సునీత అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.

గత కొన్ని రోజులుగా తనకు చీర లు కొనిపెట్టాలని భార్య సునీత భర్తను అడుగుతుంది. దీనిపై శనివారం రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపం తో రగిలిపోయిన భార్య కుక్కర్ మూతతో భర్త తలపై బాదింది. అనంతరం గొంతు నులిమి చంపేసింది. అనంతరం ప్రమాదవశాత్తు మృతిచెందాడని, గుండెపోటుతో మరణించాడని చుట్టు పక్కల వారిని నమ్మిం చే ప్రయత్నం చేసింది. ఏడేళ్ల కుమారుడు స్థానికులతో చెప్పిన వివరాలతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తలకు బలమై న గాయం, గొంతు నులమడం వల్లే హరేరామ్ మృతిచెందినట్లు పోస్టుమార్టంలో తేలింది. దీంతో పోలీసులు సునీతను అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా అసలు విష యం తెలిసింది. పోలీసులు నిందితురాలిని స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమెను 29 వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది.