నీట్ లీక్‌పై నేడు కఠిన చర్యలు
24-07-2026 01:54 AM
- క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయిస్తాం
- ఎక్స్‌లో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూలై 22: నీట్ ప్రశ్నాప్రతాల లీక్‌పై శుక్రవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పేపర్ లీక్ కేసులలో ఫాస్ట్-ట్రాక్ కోర్టులు, కఠినమైన శిక్షలను అందించే ముసాయిదా చట్టంపై శుక్రవారం కేంద్ర మంత్రివర్గం చర్చిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం అర్ధరాత్రి ఎక్స్‌లో వీడియో పోస్టు చేశారు. కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల్లోనే ఈ చట్టాన్ని పార్లమెంటులో వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు.






