18-02-2026 01:17:15 AM
పాల్వంచ, ఫిబ్రవరి 17, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్కు 44వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరుపేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య 2020 డిసెంబర్ 29న, తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటి వరకు పింఛన్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మకు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చింతల చెరువు తులసమ్మ, బొంకూరి బుచ్చమ్మ,కొత్తపల్లి విజయ్, బాలాజీ నాయక్ పాల్గొన్నారు.