calender_icon.png 18 February, 2026 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడియంకు మరోసారి స్పీకర్ నోటీసులు

18-02-2026 01:17:59 AM

ఎమ్మెల్యేల అనర్హత వివాదంలో కీలక పరిణామం

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత వివాదం లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. కడి యం శ్రీహరి పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ రేపు ఉదయం 11 గంటలకు తొలుత వివేకానంద్‌తో మాట్లాడిన తర్వాత.. కడి యం శ్రీహరిని విచారించనున్నారు. స్పీకర్ గతంలో కూడా కడియం శ్రీహరికి, దానం నాగేందర్‌కు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.