14 August, 2026 | 3:46 AM

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు

14-08-2026 01:45 AM
  1. తొలి విడతలో 1.19 లక్షల మిషన్ల పంపిణీ 
  2. 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
  3. బీసీ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం  
  4. మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చే సి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొం దేలా ప్రోత్సహించేందుకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్ప ష్టం చేశారు. 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి,  స్వయం ఉపా ధి కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం సచివాలయంలో లాంఛ నంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొ ప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12,000 కాగా, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100 శాతం సబ్సిడీపై అందజేస్తామని చెప్పారు.

ఈనెల 15 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. పేదలు, వితంతువులు, ఒం టరి మహిళలు, నిరాశ్రయులు, అనాథ లు, వికలాంగులు, కుట్టు వృత్తిలో అనుభ వం ఉన్న మహిళలకు  ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. మొదటి దశలో 1.19 లక్షల మంది అర్హులకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు. భవిష్యత్‌లో పథకాన్ని మరింత విస్తరించి ఎక్కువ మందికి ప్రయోజనం కల్పిస్తామని పేర్కొన్నారు. 

నేడు పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ

హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పా టు చేసిన మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను  శుక్రవారం సా యంత్రం 4 గంటలకు  సీఎం రేవంత్ రెడ్డి  ఆవిష్కరిస్తారని మంత్రి పొన్నం  తెలిపారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ చాంపియన్‌గా నిలుస్తోందని, 

ప్రగతి భవన్‌ను ‘మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‘ గా, సచివాలయాన్ని ‘డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం’గా పేరు మార్చినట్లు తెలిపారు. అలాగే ఈనెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వీ. హనుమంతరావు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకర య్య, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సం క్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.