జిల్లాకు చేరుకున్న స్మార్ట్ కార్డులు
ఈ నెల 15న పంపిణీకి ఏర్పాట్లు
రేషన్‌లో అక్రమాలకు చెక్ పెట్టేందుకే..?
జిల్లాకు 2,56,178 స్మార్ట్ రేషన్ కార్డులు
మంచిర్యాల, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులు ఆదునిక టెక్నాలజీతో ముద్రించిన స్మార్ట్ కార్డుల రూపంలో జిల్లాకు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 15న పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బహుళ ప్రయోజనాలు, పూర్తి భద్రతతో కూడినక్యూఆర్ కోడ్‌తో ఈ అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కూడిన పీవీసీ స్మా ర్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
రేషన్‌లో అక్రమాలకు చెక్ పెట్టేందుకేనా..?
ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పూనుకుంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు, ఎగువ ఉన్న వారికి పింక్ కార్డులుండేవి. వాటిపై ముఖ్యమంత్రి ఫొటోతో పాటు లబ్ధిదారుల గ్రూప్ ఫొటో, కుటుంబ సభ్యుల వివరాలుండేవి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి వాటి ఆధారంగా ఆన్ లైన్ లో కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన ఆహార భద్రత కార్డుల ద్వారా ద్వారా లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించి వారందరికి స్మార్ట్ కార్డులను అందజేసేందుకు సిద్ధమైం ది. ఈ పీవీపీ స్మార్ట్ కార్డులపై క్యూ ఆర్ కు టుంబ యజమాని పేరు, అడ్రస్, రేషన్ షాపు నెంబర్ తో ముద్రించి ఉన్నాయి.
పంపిణీకి 2,56,178 స్మార్ట్ రేషన్ కార్డులు...
జిల్లాలోని 18 మండలాల్లో 423 రేషన్ దుకాణాల పరిధిలో 2,56,736 రేషన్ కార్డులుండగా 2,56,178 స్మార్ట్ కార్డులు జిల్లాకు చేరుకున్నాయి. బెల్లంపల్లి మండలానికి 23, 978 స్మార్ట్ కార్డులు రాగా భీమినికి 4,722, భీమారానికి 5,303, చెన్నూర్ కు 17,993, దండేపల్లికి 17,853, హాజీపూర్ కు 11,224, జైపూర్ కు 11,584, జన్నారానికి 18,320, కన్నెపల్లికి 6,786, కాసిపేటకు 9,873, కోటపల్లికి 11,563, లక్షెట్టిపేటకు 17,252, మంచిర్యాలకు 28,345, మందమర్రికి 28,345, నస్పూర్ కు 18,485, నెన్నెలకు 7,949, తాండూరుకు 10,270, వేమనపల్లి మండలానికి 6,231 స్మార్ట్ కార్డులు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ కుమార్ చేతుల మీదుగా కార్డుల పంపి ణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.






