సభలో లేని వ్యక్తుల పేర్లు ఎందుకు?
18-03-2026 01:48 AM
మహేశ్ కుమార్ గౌడ్‌కు మండలి చైర్మన్ సూచన
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్‌కు డ్రగ్స్ టెస్టు చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ శాసనమండలిలో మంగళవారం చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేనివారి పేర్లను ప్రస్తావించొద్దని సూచించారు.
శాసనమండలి సభా వేదికను అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో సభను హుందాగా జరుపుకుందామని సూచించారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ సభలో లేని వ్యక్తుల పేర్లను తీసుకున్నందుకు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.




