22 July, 2026 | 2:11 PM

Breaking News

ఐదో తరగతి విద్యార్థుల వినూత్న జలచక్ర నమూనా ప్రదర్శన

22-07-2026 01:08 PM

గణపురం, జులై 22,(విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలోని ఫ్రోబెల్ మోడల్ హై స్కూల్‌లో ఐదో తరగతి విద్యార్థులు జలచక్రంపై వినూత్న నమూనాను రూపొందించి ప్రదర్శించారు. పాఠశాల డైరెక్టర్ ల్యాదల్ల యాదగిరి గౌడ్ పర్యవేక్షణలో విద్యార్థులు ఆసక్తి, సృజనాత్మకతతో ఈ నమూనాను తయారు చేశారు. ఈ నమూనా ద్వారా నీరు ఆవిరై మేఘాలుగా మారి వర్షరూపంలో భూమిపైకి వచ్చి, తిరిగి నదులు, చెరువుల ద్వారా సముద్రాలకు చేరే ప్రక్రియను సులభంగా వివరించారు. ఆవిరీకరణ, సంఘననం, వర్షపాతం, సేకరణ దశలను స్పష్టంగా చూపించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ యాదగిరి విద్యార్థులను అభినందిస్తూ, ఇలాంటి శాస్త్రీయ కార్యక్రమాలు విజ్ఞానాన్ని పెంపొందించి భవిష్యత్తుకు దోహదపడతాయని తెలిపారు.