22 July, 2026 | 1:41 PM

Breaking News

ఛలో లోక్ భవన్.. సంకెళ్లతో కాంగ్రెస్ నేతల నిరసన

22-07-2026 12:55 PM
  1. కాంగ్రెస్ నేతల ఛలో లోక్ భవన్
  2. ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్‌కు డిమాండ్
  3. హోరెత్తిన నగరం నడిబొడ్డు 

హైదరాబాద్: లోక్ భవన్ ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress Leaders March) ప్రయత్నించింది. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy), ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను(Union Education Minister Dharmendra Pradhan) బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరక పీసీసీ అధ్యక్షుడు చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు సంకెళ్లతో నిరసన చేపట్టారు.

ఖైరతాబాద్ సర్కిల్ లో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అటు నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ దగ్గర పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు చలో గాంధీభవన్(Chalo Gandhi Bhavan) ముట్టడికి పిలుపునిచ్చారు. మోదీ ఇంటి వద్ద రాహుల్ గాంధీ ధర్నాను(Rahul Gandhi's protest) వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్(Nampally Exhibition Grounds) నుంచి గాంధీ భవన్(Gandhi Bhavan) వరకు ర్యాలీ చేపట్టారు. గాంధీ భవన్ కు వెళ్లకుండా బీజేపీ లీడర్లను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. రెండు వర్గాల పోటాపోటీ నిరసనలతో నగరం నడిబొడ్డు హోరెత్తుతుంది. ఇరు పార్టీల నేతలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.