చలో లోక్‌భవన్‌లో ఉద్రిక్తత.. మంత్రులు, కాంగ్రెస్ నేతల అరెస్ట్
హైదరాబాద్: చలో లోక్‌భవన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లోక్ భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్( Congress leaders) నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చారు. ర్యాలీలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతల అరెస్టును నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్ భవన్ వద్ద మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, MLC బల్మూరి వెంకట్, ఫహీం లను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.






