SIR ఫామ్ నింపిన సీఎం రేవంత్ రెడ్డి
22-07-2026 12:10 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం కొడంగల్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా తన సర్ ఫారమ్‌ను సమర్పించి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అవసరమైన వివరాలను పూరించి, ఆ ఫారమ్‌ను బూత్ స్థాయి అధికారులకు (BLOs) అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, SIR ప్రక్రియ పట్ల అప్రమత్తంగా ఉండాలని, నమోదు ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా తమ పేర్లు ఓటర్ల జాబితాలో చేరేలా చూసుకోవాలని ప్రజలను కోరారు.






