సాగునీటి ప్రాజెక్టులపై వివక్ష
శాసనమండలిలో సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించకపోవడం బాధాకరమని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. శాసనమండలిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని, కానీ ఇళ్లు కోల్పోయిన వారికి తగిన పునరావాసం కల్పించాలని సూచించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు అమలుకు నోచుకోకపోవడంతో అన్ని రంగాలలో వెనకబడిపోతున్నారని తెలిపారు. రైతులకు పూర్తి రుణమాఫీ అమలు చేయాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు.




