22 July, 2026 | 12:32 PM

ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి

22-07-2026 12:02 PM

గుర్రాలగొంది గ్రామసభలో సూచనలు.. 

రంగనాయకసాగర్‌కు నీటి విడుదల కోరిన రైతులు..

సిద్దిపేట రూరల్,జూలై 22: ప్రభుత్వ ఆదేశాల మేరకు గుర్రాలగొంది గ్రామంలో సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు పొందవచ్చని సూచించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు.

ఏఈవో సాయి, హార్టికల్చర్ అధికారి రమేష్ రైతులకు పలు సూచనలు చేయగా, ఎంపీడీఓ జగన్మోహన్ వర్షాకాలంలో పారిశుద్ధ్య చర్యలు, ఫాగింగ్ నిర్వహించాలని, ఉపాధి హామీ పథకం కింద పొలం కుంటలు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు రంగనాయకసాగర్‌కు సాగునీరు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.