తదుపరి సీఎం ఎవరు?
కిస్సా కుర్సికా..
రెడ్డి x బీసీ
మరోసారి సీఎం అయ్యేది తానే అంటున్న రేవంత్‌రెడ్డి
కాదు.. కాదు వచ్చేసారి బీసీ అభ్యర్థినే సీఎం
అవుతారని వాదిస్తున్న పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
* కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీకోసం ఎప్పటినుంచో పరోక్షంగా కుస్తీ పోటీ మొదలైంది. అధికార కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి అంశం ‘రెడ్డి వర్సెస్ బీసీ’గా మారుతోంది.
‘తొక్కుకుంటూ వచ్చా.. మళ్లీ తొక్కుకుంటూ వస్తా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి తరచుగా.. ఆవేశంగా అంటుంటారు. మరోవైపు ఇక రాష్ట్రంలో రానున్నది బీసీ సీఎం అని పీసీసీ చీఫ్ ప్రకటిస్తుంటారు. ప్రభుత్వాన్ని, పార్టీని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ జోడెద్దుళ్లా సమన్వయంతో నడుపుతున్నామని చెప్పు కుంటూనే.. మరోవైపు అంతర్గతంగా ఎవరి పంథా వారిదే అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఏ సామాజికవర్గం నుంచి తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు?. ఈ ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుంచిగాని, ప్రజల నుంచిగా ని ఉద్భవించింది కాదు. ఆధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా నాయకులు చేస్తున్న ప్రకటనల నుంచే ఈ ప్రశ్న పుట్టుకువచ్చింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే మరో రెండున్నరేళ్లు ఆగాల్సి ఉంటుంది.
అయితే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీకోసం ఎప్పటినుంచో పరోక్షంగా కుస్తీ పోటీ మొదలైంది. అధికా ర కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి అంశం ‘రెడ్డి వర్సెస్ బీసీ’గా మారుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మరోసారి అధికారంలోకి వచ్చితీరుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీ సీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు మం త్రులు, ఆ పార్టీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధ్ది, సంక్షే మాన్ని గమనించి తమ పార్టీకి ప్రజలు మరోసారి అవకాశమిస్తారని వారు అభిప్రాయ పడుతున్నా రు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పటినుంచే సీఎం కుర్చీ పంచాయతీ ఎంటనేది రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది.. నేనే ముఖ్యమంత్రిని అవుతాను అంటు న్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ మాత్రం బీసీ సామాజికవర్గానికి చెందిన వారే సీఎం అవుతారు, అని ధీమాగా చెబుతున్నారు. ‘తొక్కుకుంటూ వచ్చా.. మళ్లీ తొక్కుకుం టూ వస్తా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి తరచుగా.. ఆవేశంగా అంటుంటారు.
మరోవైపు ఇక రాష్ట్రంలో రానున్నది బీసీ సీఎం అని పీసీసీ చీఫ్ ప్రకటిస్తుంటారు. ప్రభుత్వాన్ని, పార్టీని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ జోడెద్దుళ్లా సమన్వయంతో నడుపుతున్నామని చెప్పుకుంటూనే.. మరోవైపు అంతర్గతంగా ఎవరి పంథా వారిదే అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ అంటేనే అంతర్గత కలహాలకు పెట్టింది పేరు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఈ పోకడలు ఇప్పుడిప్పుడే మళ్లీ పొడచూపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మెజార్టీ అభిప్రాయం మేరకే..
సీఎం పదవికి అభ్యర్థి ఎంపిక విషయలో జాతీ య, ప్రాంతీయ రాజకీయ పార్టీలేవైనా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి.. ఎమ్మెల్యేలు అభిప్రాయం మేరకు ఆయా పార్టీల అధిష్ఠానాలు నిర్ణయాలు తీసుకోవడం సహజం. కానీ, తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతున్నదని సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా పదవిని ఆశించడం తప్పేమీ కాదు.. కానీ, నేను తప్ప ఇంకెవరు లేరు అనే వాదన సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో బీసీల ట్రెండ్ నడుస్తోందని, ఇలాంటి సమయంలో సీఎం పదవి పంచాయతీని ముందుకు తీసుకురావడమేంటి..? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. బీసీలకు ఉద్యోగ, రాజకీయంగా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే అంశం హాట్ టాఫిక్‌గా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్, రాష్ట్రపతికి పంపించడం వంటి కార్యక్రమాలు జరిగినా.. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటుతోందని న్యాయస్థానాలు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. బీసీల్లోనే అసంతృప్తిని చల్లార్చేందుకు.. రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి బీసీ వర్గాల నుంచేనని పీసీసీ చీఫ్ తరచుగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.




