‘పోలీస్ అక్క’కు జాతీయస్థాయిలో గుర్తింపు
01-04-2026 12:58 AM
నిర్మల్, మార్చి ౩౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రజల శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసు శాఖ అమలు చేసిన పోలీస్ అక్కకు జాతీయస్థాయిలో స్కోప్ అవార్డు సంతోషంగా ఉందని ఎస్పీ జానకీ తెలిపారు. జిల్లాలో 7500 మంది విద్యార్థులకు పోలీసు అక్క చేయూత అందించిందని, జిల్లాలో శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ రాజీ పడి ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇది స్ఫూర్తితో జిల్లాలో ముందుకు వెళ్దామని పేర్కొన్నారు. జిల్లాలో మహిళల ఏర్పాటు చేసిన శివంగి నారి శక్తి కార్యక్రమాలు కూడా ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.




