23-02-2026 08:52:52 PM
మర్రిగూడ,(విజయక్రాంతి): జాతీయ పక్షి నెమలి అనూహ్యంగా మృత్యువాత పడిన సంఘటన మర్రిగూడ మండలంలోని బట్లపల్లి గ్రామ శివారులో ఓ రైతు పొలంలో గత మూడు రోజుల క్రితం మృత్యు వాత పడినట్లు సంబంధిత అధికారుల విచారణలో సోమవారం వెల్లడించారు. నెమలి ఆహారపు దినచర్యలో భాగంగా వ్యవసాయ క్షేత్రంలో తిరుగుచుండగా అక్కడ ఓ కఠినమైన దారమునకు రెండు కాళ్లు బిగుసుకుపోయి కదల లేకుండా ఉండిపోయింది.
దీంతో అక్కడ రైతులు గాని ఇతరులు గాని చూడకపోవడంతో మూడు రోజులుగా వేసవి తీవ్రతతో డిహైడ్రేషన్కు గురై మృతి చెందినట్లు మర్రిగూడ పశువైద్యాలధికారి సురేందర్ పోస్టుమార్టం విచారణలో భాగంగా తెలిపారు. అయితే అక్కడి రైతులు వెంటనే స్పందించి సంఘటన విషయాన్ని అటవీశాఖ అధికారులు అఖిలేష్ గౌడ్ కు ఫోన్ ద్వారా విన్నవించడంతో అక్కడినుండి మృతి చెందిన నెమలి కళేబరము పోస్టుమార్టం నిమిత్తం మర్రిగూడ ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు.
ఆ కళేబరమును వైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించి అడవి శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. అనంతరం అటవీ శాఖ అధికారుల సమక్షంలో దహన సంస్కారాలు నిర్వహించినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అఖిలేష్ గౌడ్ మర్రిగూడ విలేకరులతో తెలిపారు. అనూహ్యంగా మృత్యువాత పడిన జాతీయ పక్షి సంరక్షణ పూర్తి బాధ్యత అటవీ శాఖ అధికారులదేనని మండల ప్రజలు కోరుతున్నారు