28 August, 2026 | 3:11 AM

పంచాయతి కార్యదర్శులు ఎక్కడ?

28-08-2026 12:00 AM
  1. గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలు
  2. క్షేత్రస్థాయిలో కనిపించని పర్యవేక్షణ?
  3. కార్యదర్శులపై ఆరోపణలు

కౌటాల, ఆగస్టు 27 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీల్లో ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై కౌటాల మండలంలో తీవ్ర చర్చ జరుగుతోంది. పారిశుధ్యం, చెత్త తొలగింపు, మురుగు కాలువల నిర్వహణ, నిల్వ నీరు, దోమల బెడద వంటి సమస్యలు గ్రామాల్లో ఉన్నప్పటికీ వాటిపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఎంతమేర జరుగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండా ల్సిన కార్యదర్శులు స్థానికంగా ఉండటం లే దన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

కార్యదర్శులు గ్రామాల్లో ఉంటున్నారా?

పంచాయతీ కార్యదర్శి గ్రామ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రజల నుం చి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడం, పారిశుధ్య పనులను పర్యవేక్షించడం, పంచాయ తీ సిబ్బంది పనితీరును గమనించడం వంటి బాధ్యతలు ఉంటాయి. అయితే కార్యదర్శు లు గ్రామంలో అందుబాటులో లేకపోతే చి న్న సమస్య పరిష్కారానికి కూడా ప్రజలు కా ర్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని స్థా నికులు ఆరోపిస్తున్నారు.

గ్రామ పంచాయతీలు ప్రజలకు అత్యంత సమీపంగా పనిచేసే పాలనా వ్యవస్థ కావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆరోపణలు, అధికారుల వి వరణల మధ్య వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులు పరిశీలించి గ్రామాల్లో పారిశు ధ్యం, దోమల నివారణ, ప్రజలకు అందుబా టు అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

 10 నుంచి 5 వరకు విధులా....?

గ్రామం అభివృద్ధి పరచడంలో పంచాయతీ కార్యదర్శులు కీలకంగా వ్యవహరిం చాల్సి ఉంటుంది. కానీ పంచాయతీ కార్యదర్శులు ఉదయం 10 గంటలకు విధులకు వ చ్చి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తారని మండల స్థాయి అధికారి చె ప్పడం హాస్యాస్పదంగా ఉంది. కార్యదర్శులు తాము పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉండాల్సిన అవసరం లేదని, ఎక్కడి నుంచైనా వచ్చి విధులు నిర్వహించవచ్చని వారికి వత్తాసు పలకడం విడ్డూరంగా ఉంది.

దోమల నివారణ ప్రశ్నార్థకం ...?

గ్రామాల్లో దోమల నివారణ ప్రశ్నార్థకంగా మారుతుంది.ఫాగింగ్ పట్టణాల్లో మాత్రమే సాధ్యమవుతుందా..? పల్లెల్లో ఫాగ్ స్ప్రేయింగ్తో ఫలితం ఉండదనుకుంటే గ్రామాల్లో పెరుగుతున్న దోమల బెడదను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటి? మురుగు కాలువలు, నిల్వ నీటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారా? పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారా? అన్నది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

పనితీరుపై పర్యవేక్షిస్తాం

పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై పర్యవేక్షణ చేపడతాం. కార్యదర్శులు ఉదయం 10 గంటలకు వచ్చి 5 వరకు ఉంటారు. సిటీలో ఫాగింగ్ కుదురుతుంది గ్రామాలలో తలుపులు, కిటికీలు పెట్టుకోరు కావున దోమల నివారణకు ఫాగింగ్ కష్టతరం. కార్యదర్శులు స్థానికంగా ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడి నుండైనా వచ్చి పని చేయొచ్చు.

కోట ప్రసాద్, ఇన్‌చార్జ్ ఎంపీడీవో