పంట.. అమ్ముకునేందుకు మార్కెట్ ఏది?
నిర్మల్ జిల్లాలో మిర్చి రైతులకు తప్పని కష్టాలు
నిర్మల్, మార్చి ౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మిర్చి పంటను పండించిన రైతులకు అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లేదు. దీంతో పంటను అమ్ముకోవడానికి రైతులు సరిహద్దు మహారాష్ట్రలో ఉన్న మార్కెట్లకు తరలించవలసి వస్తుంది. దీనివల్ల మార్కెట్ ఆదా యానికి గండిపడడం మీ కాకుండా పంటను అమ్ముకోవడానికి రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో సారంగాపూర్ భైంసా, ముధోల్, లోకేశ్వరం, బాసర, కుబీర్ కుంటాల, నర్సాపూర్ తదితర మండలాల్లో ఖరీఫ్ సీజన్లో 5000 ఎకరాలు మిర్చి పంటను సాగు చేశారు.
పంట కాలం 180 రోజులు అయినప్పటికీ మార్కెట్లో పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చికి డిమాండ్ ఉంటుందని రైతులు ఈ పంటలు సాగు చేస్తున్నారు. ఇతర పంటల తో పోలిస్తే మిర్చి పంటకు పెట్టుబడులు అధికంగా ఉండడం నిర్వహణ ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్లో ధర డిమాం డ్ ఉండడంతో పంటలు సాగు చేస్తున్నారు. కూలీల సాయంతో పంటను సేకరించి పంట కళ్ళలో ఆరబెట్టి మార్కెట్ తరలించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు
అమ్ముకోవడానికి అవస్థ
నిర్మల్ జిల్లాలో మిర్చి పంటను సాగుచేసిన రైతులు ఆ పంటలు అమ్ముకోవడానికి పడడానికి పాటుపడుతున్నారు. జిల్లాలో భైంసా వ్యవ సాయ మార్కెట్లో మాత్రమే నామవాత్రపు కొనుగోలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్మల్ ఖానాపూర్ సరంగాపూర్ కుబీర్. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా కొను గోలు మాత్రం భైంసాలోని నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ వ్యాపారులు మహారాష్ట్ర వారు ఎక్కువగా వస్తున్నాడంట తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం మిర్చికి క్వింటా ళ్లుకు 18,000 వరకు ధర పలుకుతుంది. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర ను తగ్గిస్తున్నారు. దీంతో రైతులు మిర్చి పంట లు మహారాష్ట్రలోని ధర్మాబాద్ బోకర్ నాగపూ ర్ జాల్‌న తెలంగాణలోని ఖమ్మం వరంగల్ మార్కెట్ తరలిస్తున్నారు. ఈ మార్కెట్‌లు ఈ ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల నుంచి 300, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పంటను అమ్ముకోవడానికి రవాణా చేసేందు కు రైతులకు అధికంగా ఖర్చులు అవుతున్నా యి.
దీనికి తోడు రైతుల సమయం కూడా వృ ధా అవుతుంది. అష్ట కష్టాలు పడి అక్కడికి పం ట తీసుకెళ్లిన అక్కడ కూడా కొన్ని సందర్భాల్లో వ్యాపారులు నిర్ణయించిందే ధర ఉండడంతో గత్యంతర లేక అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. ఇతర పంటలతో పోలిస్తే విరుచుకుంటకు పెట్టుబడులు నిర్వాణా ఖర్చులు అధికంగా అయినప్పటికీ ఎకరానికి 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని ఆశతో పంటలు పండించిన రైతులకు మార్కె ట్ సౌకర్యం లేక నష్టపోవాల్సి వస్తుందని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




