30 June, 2026 | 7:54 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

ప్రయాణం ప్రాణ సంకటం

02-03-2026 12:49 AM

కుబీర్, మార్చి ౧ (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని నిగ్వ రహదారి అద్వానంగా మారడంతో ప్రజలకు పాల సంకటనగా తయారైంది. మాలేకం ప్రధాన రహదారి నుండి నిగ్వ వరకు 12 కిలోమీటర్ల రహదారి గుంతల మయంగా మారింది. భైంసా నుండి మాలేగాం ద్వారా నిగ్వ, అక్కడినుండి మహారాష్ట్రలోని బోకర్ నాందేడ్ వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి. ఈ రహదారిపై ప్రతిరోజు తెలంగాణ మహారాష్ట్ర కు చెందిన ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు సరుకు రవాణా వాహనదారులు ప్రయాణం చేయవలసి ఉంటుంది.

12 కిలోమీటర్ల రహదారి పై వేసిన బి టి రోడ్డు లేచిపోయి కంగారు తేలి గుంతలుగా ఏర్పడ్డాయి. రోడ్డుకు అటు ఇటు ఎత్తు పల్లాలు ఉండడంతో ప్రయాణికులు వాహనదారులు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగిల్ రోడ్డు కావడం గుంతలు ఏర్పడడంతో ఎదురు ఎదురుగా వాహనాలు వస్తే ఇక అంతే సంగతి. రాత్రి సమయంలో గుంతలు ఏర్పడక ద్విచక్ర వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ రహదారిపై కుంభీ వాయి లింగి తాండూర్ మండలంలోని మహలింగి బామ్ని బేల్తురుడాకు లింకు రోడ్డు ఉంది.

కుబీర్ తానూర మండలాలు కలిపి బైపాస్ కలిపి రహదారి ఇది కావడంతో ప్రతినిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. గుంతలను మొరంతో పూడ్చినప్పటికీ అవి తిరిగి లేచిపోవడంతో గుంతలు ఏర్పడడం ఆ దుబ్బ కారణంగా ప్రజల కంట్లో పడి అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణి కురాలు గుంతల కారణంగా బస్సు కుదుపు చేయడంతో నడుము విరిగి మంచానికి పరిమితమైంది. దీంతో ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. ఈ రహదారి మరమత్తులు చేయాలని డబుల్ రోడ్డుగా మార్చాలని గ్రామాల ప్రజలు కోరుతూ వస్తున్నారు.

నిధులు మంజూరైన పనులు ప్రారంభం కాలే..

నిగ్వ గ్రామంలో గల పాఠశాలకు వారాంతపు సంతలకు పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుంచి ప్రజలు విద్యార్థులు రాకపోకలు సాగిస్తారు. మాలేగాం క్రాస్ రోడ్ నుంచి నిగ్వ వరకు 20 కోట్ల నిధులు మంజూరైనట్టు ఆరు నెలల క్రితం అధికారులు ప్రజాప్రతినిధులు ప్రకటించారు.

ఈ నిధులతో పూర్తిస్థాయిలో తారు రోడ్డును నిర్మించడం గుంతలు పూడ్చ డం రోడ్డుకిరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం వంటి పనులను చేపట్టవలసిన ఇప్పటివరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత గ్రామాల ప్రజలు ఇప్పటికీ ఎమ్మెల్యే రామారావు పాటిల్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ నేటీకి కూడా పనులు ప్రారంభం కాలేదు.