నేడు రాష్ట్రానికి రాహుల్‌గాంధీ రాక
- వికారాబాద్‌లో జరిగే డీసీసీ అధ్యక్షుల ముగింపు సమావేశానికి హాజరు
- మావోయిస్టు మాజీ అగ్రనేతలతో భేటీ?
హైదరాబాద్, మార్చి1(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో జరిగే ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు రాహుల్‌గాంధీ శంషాబాద్ విమానాశ్రాయానికి రానుండగా, సీఎం రేవంత్‌రెడ్డి ఏయి ర్‌పోర్టులో స్వాగతం పలకనున్నారు.
అక్కడి నుంచి రాహుల్‌గాంధీతో కలిసి నేరుగా వికారాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ, అంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమం తర్వాత తిరిగి రాహుల్‌గాంధీ శంషాబాద్ ఏయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇటీవలనే జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ భేటీ అ య్యే అవకాశం ఉందని సమాచారం.
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీపై కేం ద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చర్చిం చే అవకాశం ఉందని తెలిసింది. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సచివాలయంలో మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాహుల్‌గాంధీతో భేటీ అవుతారనే ప్రచారంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




