calender_icon.png 22 February, 2026 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు ఏమిచ్చారు?

22-02-2026 02:18:12 AM

కేటాయింపులు గుమ్మడికాయంత.. ఖర్చు పెసరగింజంత!

బీసీలకు గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఖర్చుపెట్టిన దాఖలాలు కనిపించడం లేదు.  వచ్చే బడ్జెట్‌లోనైనా బీసీల అభివృద్ధికి ‘మేమెంతో.. మాకంత’ అనే సూత్రం ఆధారంగా కేటాయింపులు ఉండాలని, వాటన్నింటినీ ఖర్చుపెట్టాలని బీసీలు కోరుతున్నారు.

కేటాయించిన నిధులను ఖర్చుచేయరా? 

బడ్జెట్‌లో బీసీలకు ఈసారైనా న్యాయం జరిగేనా?

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేండ్లకుపైగా కాలం గడిచింది. వార్షిక బడ్జెట్లను సమర్పిస్తూ, చట్టస భల్లో బీసీలకు కేటాయింపుల విషయంలో ఢాంబీకాలకు పోతున్నారు. వాస్తవంగా బీసీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను.. చేసిన ఖర్చును చూస్తే, ఖర్చు పిసరంతకూడా ఉండటం లేదు. రాష్ట్రంలో 50 శాతంకంటే అత్యధికంగా ఉన్న బలహీనవర్గాలకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు ఊరిస్తున్నట్టుగానే ఉంటున్నాయి.

కేటాయించిన నిధులు కాగితాలపైనే ఉంటున్నాయి తప్ప ఖర్చుపెట్టిన దాఖలాలు కనిపిం చడం లేదు. అంతేకాదు, కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటోందని స్పష్టంగా అర్థమవు తున్నది. 

ఈ విషయంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకూడా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీసం వచ్చే బడ్జెట్ (2026 27)లో అయినా బీసీల అభివృద్ధికి ‘మేమెంతో.. మాకంత’ అనే సూత్రం ఆధారంగా కేటాయింపులు ఉండాలని.. వాటన్నింటినీ ఖర్చు పెట్టాలని బీసీ ప్రజలు కోరుతున్నారు. ఈ యేడాది బడ్జెట్‌లోనైనా బీసీలకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని బీసీ వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి.

బీసీ సంక్షేమంలో.. క్షామం! 

బీసీల సంక్షేమానికి ప్రతి ఏడాది రూ. 20 వేల కోట్ల చొప్పున, ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే ప్రభుత్వం చట్టసభలో వెల్లడించిన అధికారిక గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనకబడిన తరగతుల కేటాయించిన రూ. 11,500 కోట్ల బడ్జెట్‌లో ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులు ఎంత, దేనికి ఖర్చుచేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిని అడిగారు. అందుకు సమాధానంగా.. రూ. 11,500 కోట్లు కేటాయించి..

ఇప్పటివరకు ఖర్చు పెట్టింది రూ. 2,426 కోట్లు అంటూ మంత్రి రాతపూర్వకంగా చెప్పారు. మరి మిగిలిన రూ. 9,000 కోట్ల రూపాయలు బీసీల సొమ్ము ఎటుపోయాయి? అంటే సమాధానం లేదంటూ ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల రూ.1,908 కోట్లు ఇస్తామని చెప్పి.. రూ.365 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా నిధులు ప్రభుత్వం ఇతర రంగాలకు మళ్లించారు. హాస్టళ్లలో ఉంటూ చదువుతున్న బీసీ విద్యార్థులకు రూ.435 కోట్లతో సన్నబువ్వ పెడతామని చెప్పిన ప్రభుత్వం  రూ.120 కోట్లు కేటాయించి..

అవికూడా ఖ ర్చు చేయలేదు. మహాత్మ జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద బీసీలకు ఈసారి రూ.700 కోట్లకు స్కాలర్‌షిప్‌లు పెంచుతామని చెప్పి చేతులెత్తేశారు. మహాత్మ జ్యో తిబా పూలే రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం అనిచెప్పి రూ.1,871 కో ట్లు కేటాయించి.. రూ.1,300 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక్కడ మాత్రమే ఎందుకు అంతగా ఖర్చుపెట్టిండనే అనుమానం రావచ్చు.. ఎందుకంటే..

నిర్మాణ పనులు కదా.. కమీష న్లు గిట్టుబాటు అవుతాయనేది లోగుట్టు. బీ సీ యువత చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలని స్టడీ సర్కిల్ పెడితే ఆ స్టడీ సర్కిల్‌కు రూ. 50 కోట్లు కేటాయించి కేవలం నా లుగు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టింది ఈ ప్ర భుత్వం. బీసీల విద్యారంగం మీద రూ. 4,345 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి రూ. 2,068 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన రూ. 2,300 కోట్లు బీసీల విద్యారంగానికి చెందిన సొమ్ము ఎక్కడికి పోయిందో ప్రభుత్వానికే తెలియాలి. 

మొత్తంగా, బీసీలకు కేటాయింపు చాంతాడంత.. చేసిన ఖర్చు గొర్రె తోకంతకూడా లే దు. ఇప్పటికైనా తాజా బడ్జెట్‌లో (2026 27)లో.. సమాజంలో 50 శాతానికంటే ఎక్కువగా ఉన్న బీసీ వర్గాలకు అదే స్థాయి లో బడ్జెట్ కేటాయింపులు ఉండాలని బీసీ నేతలు బలంగా నినదిస్తున్నారు.

మేమెంతో.. మాకంత అనే నినాదం ప్రకారం.. అటు రాజకీయ పదవులేకాదు.. బడ్జెట్లోనూ కేటాయిం పులు ఉండాలని, ఆ మొత్తాన్ని బీసీల అభ్యున్నతి కోసమే ఖర్చు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బీసీ సబ్‌ప్లాన్ ఏది..?

బీసీల అభ్యున్నతికి నిధులు మంజూరుచేసేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీల కోసం, చట్టబద్ధంగా మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అసెంబ్లీ మొదటి సమావేశం అయిపోయింది.. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరో సమావేశం కూడా అయిపోయింది. ఇప్పటివరకు బీసీ సబ్ ప్లాన్ గురించి సర్కారు నోట్లోనుంచి మాట రాలేదు.

శాసన మండలిలో తాను బీసీలకు సబ్‌ప్లాన్ కావాలని గట్టిగా అడిగినా.. అధికార పార్టీతోపాటు ఇతర పార్టీ సభ్యుల నుంచి కనీసం స్పందన లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. కనీసం ఇప్పటికైనా బీసీ సబ్ ప్లాన్‌ను ప్రకటించి.. అందు కు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

జీవనోపాధి రంగంలోనూ..  

తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు సహాయంగా రూ. 70 కోట్లు కేటాయిం చి, కేవలం రూ. 19 కోట్లు మాత్రం ఖర్చుపెట్టింది. చేనేత కార్మికులకు సహాయం చేస్తామని రూ. 450 కోట్లు కేటాయించి, అదులో రూ. 168 కోట్లు మాత్రమే ఖర్చు చేసి.. మిగిలిన దాదా పు రూ. 300 కోట్లు  ఇతర రంగాలకు మళ్ళించారు.

22 బీసీ కార్పొరేషన్లు, రాజీవ్ యువవికాసం కింద రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రు ణాలు ఇస్తామని, ఇందుకు రూ. 4,000 కోట్లు ఖర్చు పెడతామని  చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఇప్పటివరకు కేవలం రూ. 13 కోట్లుఖర్చు పెట్టి చేతు లు దులుపుకున్నారనేది స్పష్టం. 

సామాజిక రంగంలో మొండిచేయి.. 

బీసీ ఆడబిడ్డల పెళ్లిల్లకు కళ్యాణలక్ష్మి కోసం రూ.2,173 కోట్లు ఖర్చు కేటాయిస్తున్నామని చెప్పి ఇప్పటి వరకు రూ. 108 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. మిగిలిన రూ. 2000 కోట్లు షరా మామూలుగానే మళ్ళించారు. వెనకబడిన తరగతుల కోసం ప్రత్యేక కమిషన్ వేసి రూ. 21 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి.. కేవలం రూ. 3 కోట్ల 49 లక్షలు ఖర్చుపెట్టింది. మొత్తంగా రూ. 2,194 కోట్లు సామాజిక రంగంపై ఖర్చుపెడతామని చెప్పిన ప్రభుత్వం కేవలం రూ. 112 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది.

బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ఇప్పటివరకు రూపాయి ఇయ్యలేదు. అన్ని జిల్లా కేం ద్రాల్లో రూ. 50 కోట్లతో కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేస్తామ ని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ గాలిలో కలిసింది. ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు అన్నారు.. అవి ఎక్కడా లేవు. ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో కొత్త డిగ్రీ కళాశాలు ఏర్పాటుచేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఎక్కడా ఏర్పాటు చేయలేదు.

మూడు లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌కూడా చేయలేదు. చేతివృత్తులకు సహా యం చేసేలా.. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగళి, వ డ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారుల వంటి చేతివృత్తుల వారి కి  షాపుల కోసం ఉచితంగా స్థలాలు అందజేస్తామని ప్రభు త్వ పెద్దలు చెప్పారు. కానీ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటికూడా నిర్మించలేదు.

జగిత్యాల, నారాయణపేట, భువనగి రిలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్లను ఏర్పాటుచేసి పద్మశాలీలకు పవర్ లూమ్స్, పరికరాలపై 90 శాతం సబ్సిడీ ఇస్తా మన్నారు. ఒక్క ఆణా పైసా ఇయ్యలేదు. మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగి, కుమ్మర్లకు 90శాతం సబ్సిడీతో టూల్ కిట్లు అన్నారు.. ఒక్కటికూడా ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా దోబీ ఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు రూ. 10 కోట్ల కేటాయిస్తామన్నారు. పైసా ఇవ్వలేదు.