22-02-2026 02:16:26 AM
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి ౨౧ (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రముఖ కార్టూనిస్ట్ సురేంద్ర వెలువరించిన ‘అక్షింతలు’ అనే పుస్తకావిష్కరణ సభ జరుగనుంది. కార్టూనిస్ట్ సురేంద్ర కార్టూన్లకు సంపాదకుడు (దివంగత) గజ్జెల మల్లారెడ్డి భాష్యం చెప్పిన పుస్తకమిది. వ్యంగ్య చిత్రాలు, సామాజిక అంశాల కలబోతగా పుస్తకం రూపుదిద్దుకున్నది. సభకు మందలపర్తి కిషోర్ అధ్యక్షత వహిస్తారు.
కవయిత్రి, సీనియర్ జర్నలిస్టు కొండేపూడి నిర్మ ల, సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్, చిత్రకారుడు, సీనియర్ జర్నలిస్ట్ టీ శివాజీ, ప్రము ఖ కార్టూనిస్ట్‌లు నర్సిం, మృత్యుంజయ పుస్తకంపై తమ అభిప్రాయాలను పంచుకుం టారు. కళాకారులు, రచయితలు, జర్నలిజం రంగంపై ఆసక్తి ఉన్నవారంతా కార్యక్రమానికి విచ్చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. పుస్తకం కావాల్సిన వారు 93472 34086 అనే వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.