25 August, 2026 | 6:04 AM

జేఎస్‌ఎఫ్‌తో నీకేం పని?

25-08-2026 01:07 AM
  1. మామ్దానిని ఎందుకు కలవాలనుకున్నావు
  2. సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల ప్రశ్నలు

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): జాతిని విచ్ఛిన్నం చేసే జార్జి సొరస్ ఫౌండేషన్(జేఎస్‌ఎఫ్)తో నీకేం పని అంటూ సీఎం రేవంత్‌ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మోదీని టెర్రరిస్ట్‌తో పోల్చిన మేయర్ మామ్దానిని ఎందుకు కలవాలి అనుకున్నావని ప్రశ్నించారు. సీఎం రేవంత్ భాష అత్యంత నీచంగా ఉందన్నారు. కూటిలో రాయి తీయలేనొడు ఎట్లో రాయి తీస్తా అనే విధంగా ఉంది రేవంత్ తీరన్నారు.

ఆక్స్‌ఫర్డ్, విదేశీ చదువుల కంటే ముందు నుంచే భారత్‌లో నలంద, తక్షశీల యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. చీకటి పాలనకి కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ పాలన ఉందన్నారు.  రేవంత్ పాలనలో స్కాంలు తప్ప సరైన స్కీంలు లేవని ఎద్దేవా చేశారు.  రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో టాయిలెట్లు కూడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యా శాఖ మంత్రిగా రేవంత్ తలదించుకోవాలని విమర్శించారు. రేవంత్ రెడ్డికి అబద్ధాలు చెప్పడమే ఫిలాసఫీ అని పేర్కొన్నారు.