25 August, 2026 | 3:39 AM

ఫీజుల బకాయి, బీజేపీ లడాయి.. చేపట్టిన దీక్షకు మద్దతు

25-08-2026 01:07 AM

మనోహరాబాద్, ఆగస్ట్ 24: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారాపు రామచంద్ర రావు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చేపట్టిన దీక్ష ఫీజుల బకాయి, బిజెపి లాడాయి అనే కార్యక్రమనికి మద్దతుగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం నత్తి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్మేంట్ విడుదల చేయాలని కోరారు.

లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ సింఘం సత్యయ్య, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్ర శేఖర్ ముదిరాజ్, కౌన్సిలర్ చందా అశోక్ యాదవ్ లు పాల్గొన్నారు.