25 July, 2026 | 1:50 AM

ఎస్సీ నియోజకవర్గాల్లో మీకేం పని?

25-07-2026 12:54 AM
  1. మా జోలికి వస్తే ఖబర్దార్
  2. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు హాస్యాస్పదం
  3. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు 

తుంగతుర్తి, జూలై 24: తుంగతుర్తి నియోజకవర్గం ఆగమవుతుందని మునుగోడు ఎమ్మె ల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉన్నదని, నియోజకవర్గ రోడ్ల పరిస్థి తిపై స్పందించని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని తుంగ తుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. తిరుమలగిరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నుంచి వచ్చిన నీకు మాట్లాడే హక్కు లేదని రాజగోపాల్‌ను విమర్శించారు.

ఫస్ట్ నీ మునుగోడు మురికిని కడుక్కో అంటూ ఎద్దేవా చేశారు. నీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నీతో వచ్చిన వాళ్లకే మండల పార్టీ అధ్యక్ష పద వి ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ‘నా హక్కులను హరిస్తే, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా. మంత్రి కోమటిరెడ్డికి మెంటల్ ఎక్కింది. తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చినప్పుడు కనీసం నాకు సమాచారం ఇవ్వలేదు. దీనిపై పీసీసీ, ఏఐసీసీ నాయకులకు ఫిర్యాదు చేస్తా.

దళిత నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏమిటి? నల్లగొండ జిల్లా అంటే శ్రమజీవుల జిల్లా... పోరాటాల గడ్డ. నా నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి గురించి మంత్రి వెంకట్‌రెడ్డికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. మా మాదిగోల్ల  నియోజకవర్గాల జోలికొస్తే మా చిర్రామొగుద్ది. మా చిటిక మొగు ద్ది. మా పని కత్తులు లేస్తాయి ఖబర్దార్’ అని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ నియమించిన వారే మండలాల అధ్యక్షులుగా కొనసాగుతారని చెప్పారు.