బెంగాల్ ఎన్నికలు: 11 గంటల వరకు 41.11 శాతం పోలింగ్.. ముర్షిదాబాద్‌లో ఘర్షణలు
కోల్‌కతా: బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు(West Bengal Elections 2026) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకారం, ఉదయం 11 గంటల నాటికి రాష్ట్రంలో 41.11 శాతం పోలింగ్ నమోదైంది. 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
ఉదయం 9 గంటల సమయానికి, 3.60 కోట్ల మంది ఓటర్లలో 18.76 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తొలి విడతలో 40 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికల బరిలో 1478 బంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బెంగాల్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ పటిష్ట చర్యలు తీసుకుంది. తొలి విడతలో భావానీపూర్ నుంచి మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. రెండో విడతలో 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహిస్తారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. ముర్షిదాబాద్‌లో ఘర్షణలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ముర్షిదాబాద్‌లో ఘర్షణ చెలరేగింది. ఆ ప్రాంతానికి 'ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ' (AUJP) వ్యవస్థాపకుడు హుమాయున్ కబీర్ చేరుకోగానే, తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్తలు నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ సందర్భంగా, గురువారం ముర్షిదాబాద్ జిల్లాలోని డోమ్‌కల్‌లో పలువురిని ఓటు వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం (ECI) అధికారుల నుంచి నివేదిక కోరిందని అధికారులు తెలిపారు. దోమ్‌కల్‌లోని పలువురు ఓటర్లు తమను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తే తమపై దాడి చేస్తామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.






