7 March, 2026 | 5:41 PM

ప్రమాదకరస్థితిలో పశ్చిమాసియా!

05-03-2026 12:00 AM

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అమెరికా తనను తాను ‘వరల్డ్ బాస్’గా ఊహించుకుంటూ ప్రపంచ వ్యా ప్తంగా పలు ఘర్షణలకు కేంద్రీకృతంగా నిలు స్తూ వస్తున్నది. ప్రధానంగా తమ ఆర్థిక, రాజకీయ, అణ్వస్త్రాల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, తమ దేశానికి ముప్పుగా భావిం చిన దేశాలను మట్టుబెట్టడానికి గిల్లి మరీ క య్యం పెట్టుకుంటున్నది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలే అందుకు ఉదాహరణ.

ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దాడులు చేస్తున్న తీరు పశ్చిమాసియాను అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టేస్తున్నాయి. అమెరికా మెరుపు దాడులు చూస్తే దేశాలకు అణ్వస్త్రాలే బలమా అనే ప్రశ్న ఉద్భవిస్తోంది. ఇజ్రాయిల్, -ఇరాన్ మధ్య వైరం దశాబ్దాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భౌగోళిక, రాజకీయ, సైద్ధాంతిక పోరు 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత  తీవ్రమయ్యింది. శత్రువుకు శత్రువే మిత్రుడన్న మాదిరిగా గతంలో ఇరాన్‌కు అండగా ఇరాక్‌పై అమెరికా చేసిన దాడి గుర్తుకు వస్తుంది.

2003లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. సద్దాం హుస్సేన్ వద్ద రసాయనిక, అణు ఆయుధాలు ఉన్నాయని ఆరోపించి దాడి చేశారు. తర్వాత, అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ‘మేము పొరపా టు చేశాం‘ అని చాలా కాలం తర్వాత అంగీకరించారు. అలాగే బుష్ 2005లో ‘ఇంటెలి జెన్స్ తప్పు’ అని పేర్కొన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే జరిగిన నష్టానికి అమెరికా ఏనాడు పశ్చాత్తాపానికి లోనవ్వలేదు.

తాజాగా పశ్చి మాసియా ప్రాంతంలో చమురు వంటి కీలక వనరులపై పట్టు సాధించడం కోసం ఇప్పుడు ఇరాన్‌పై చేస్తున్న దాడి కూడా అదే దారిలో సాగుతోంది. ఇజ్రాయెల్ వంటి మిత్రదేశాలకు అమెరికా మద్దతు ఇవ్వడం సంయుక్తంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత, ఇరాన్ ప్రతీకారేచ్చతో రగిలిపోతుంది. ఇవాళ ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భయాలను రేకెత్తిస్తోంది. వేలాది మంది ప్రయాణికులను చిక్కుల్లో పడేసింది.

ఆంక్షల పర్వం..

మొదటి నుంచి కూడా బలవంతులదే రాజ్యం అన్నట్లు ఉన్న ప్రపంచ పరిస్థితులు ఇప్పటికి అదే విధంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, చర్చలు, ఒప్పందాల వంటివన్నీ బలవంత ఉల్లంఘనలకు గురవుతున్నాయి. ఆయుధ బలం, ధన బలం మాత్రమే రాజ్యమేలుతున్నాయి. వా స్తవానికి ఇరాన్, అమెరికా మధ్య ఎంఓ యూ కొద్దిరోజుల్లో పూర్తవుతుందని మధ్యవర్తి ఒమన్ ప్రకటించింది. కానీ ఆ లెక్క తేల కముందే  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహుల బాధ్యతారాహిత్య చర్యతో పశ్చిమా సియా ఉలిక్కిపడింది.

ఈ దాడుల వెనుక ఉన్న కారణాలు ఏకపక్ష నిర్ణయాలు, అపోహలు, నిందలు ఇరాన్ అణు ఆయుధాలు కలిగి ఉందనే ఆరోపణలు దశాబ్దాలుగా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తూనే వస్తున్నాయి. అయితే అంతర్జాతీయ అయిల్  ఇంధన సంస్థ నివేదికల ప్రకారం, 2000 తర్వాత ఇరాన్‌లో అణ్వాయుధాల అభివృద్ధి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ రిపోర్ట్ ఇచ్చింది.

పాలస్తీనా లాంటి చిన్న దేశం వద్ద, ఇరాన్ వంటి మధ్యమదేశం వద్ద అణ్వస్త్ర శక్తి ఉం డుంటే పాలస్తీనా సమస్య 1948లోనే పరిష్కారమయ్యేదని ఒకానొక సందర్భంలో ఇజ్రాయెల్, అమెరికాలు అంగీకరించిన మా ట వాస్తవం కాదా? అయితే ఇరాన్ వద్ద అణ్వస్త్రాల ఉత్పత్తికి తగిన సామర్థ్యంతో పాటు,అవసరమైన సామగ్రి ఉన్నమాట నిజం. కానీ అణ్వస్త్రాలు ఇస్లాంకు విరుద్ధమైనవంటూ వాటి తయారీని ఇరాన్ అధిపతి అలీ ఖమేనీ బహిరంగంగా నిషేదించారు. అయితే శాంతియుత వినియోగానికి మాత్రమేనని చెప్పి ఆ శక్తిని అభివృద్ధి పరుస్తాన్నా రనే దురుద్దేశ్యంతో అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. 

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..

ఇరాన్ చుట్టూ అమెరికా బలగాల మో హరింపు వల్ల ముడి చమురు ధరలు సుమా రు 10 శాతం పెరిగిపోయాయి. ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం పడనుంది. భారత్ వినియోగించే 85 శాతం చమురులో భారత్ ప్రతి రోజూ 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ నుంచి హర్మూజ్ జలసంధి మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటోంది. అందుకే అంతర్జా తీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొద్దిగా పెరిగినా కూడా దేశం చెల్లించాల్సిన దిగుమతి బిల్లులు ఒక్కసారిగా పెరిగిపోతాయి.

ఈ యుద్ధ వాతావరణంలో ముడి చమురు బ్యారెల్ ధర ఒకవేళ 90 డాలర్లు దాటితే మనకు ఇబ్బందులు తప్పవు. చము రు ధరలు పెరిగితే ఎక్కువ డాలర్లు చెల్లించా ల్సి రావడంతో రూపాయిపై ఒత్తిడి పడుతుంది. తద్వారా రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశముంది. అలాగే భారత్ నుంచి ఇరాన్‌కు ఎగుమతయ్యే ఫార్మా, టీ, సుగంధ ద్రవ్యాలు, బాస్మతీ బియ్యం తదితర వస్తువులపై కూడా ప్రభావం ఉంటుం ది. అయితే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసి వేసినట్లు ప్రకటించింది.

దీంతో చమురు రవాణా చేస్తున్న దాదాపు వంద నౌకలు మధ్యలోనే నిలిచిపోయినట్లు సమాచారం. అయితే హర్మూజ్ జలసంధి మూసివేత ద్వా రా రవాణాకు ఆటంకం ఏర్పడితే ఇంధన, సరకు రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరగనున్నాయి. దీనివల్ల మొదట ఆసియా దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండుగా విడిపోతే..

ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం భీక ర రూపం దాల్చింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్య ఆ దేశాన్ని మరింత అట్టుడికిపోయేలా చేసింది . ఖమేనీ మరణాన్ని తట్టుకోలేని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) సేనలు సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులతో విరుచుకుపడుతుంది.

అటు ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ క్యాంప్ సహా రాజధాని కేంద్రంగా ఇరాన్ మిలటరీ దాడులను తీవ్రతరం చేసింది. యుద్ధంలో ఇజ్రా యెల్‌ను ఆటబొమ్మగా వాడుకుంటూ అమెరికా తమపై దాడులకు దిగుతోందని, ఖమే నీ హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు దాడులను ఆపేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఇరాన్‌లో ప్రారంభమైన అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 700కు పైగా మరణించినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది, వీరిలో బాలికల ప్రాథమిక పాఠశాలలో నుంచే కనీసం 168 మం ది ఉన్నారని ఆ దేశ రాష్ట్ర మీడియా నివేదించింది.

ఇరాన్ తమ భూగర్భంలో చాల లోతున దుర్బేధ్యమైన రక్షణలో అత్యాధునిక అణ్వస్త్రాలను తయారు చేస్తుందనేది ఇజ్రాయెల్ భయం. అందుకే ఇరాన్ తూర్పు ప్రాంతంలో తిష్ట వేసి మరీ నాతంజ్, ఫార్డోవ్ కేంద్రాలను నిర్వీర్యం చేయడమలే లక్ష్యంగా పెట్టుకుంది. ఇరాన్‌పై దాడి చేయాలంటే ఇజ్రాయెల్ నుంచి వెయ్యి మైళ్లకు పైగా దూరమే గాక, వంద యుద్ధ విమానా లు రంగంలోకి దిగినప్పటికీ ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుంటూ రావా లన్నదే అమెరికా అంచనా. ఇరాన్ అణుకేంద్రాలను దెబ్బతీయాలనే అమెరికన్ బంకర్ బ్లస్టర్‌కు తప్ప ఇజ్రాయెల్‌కు లేదు.

అయితే ఇజ్రాయెల్ బలం మొత్తం అమెరికానే. ఇక 56 ఇస్లామిక్ దేశాల్లో 10 దేశాలు ఖమేనీ హత్యను ఖండించాయి. జీ కూటమి దేశాలు సంతాపం తెలుపలేదు. కానీ, యుద్దానికి రెం డు రోజుల ముందే ఇజ్రాయెల్‌లో భారత ప్రధాని పర్యటించినప్పటికీ యుద్ధంపై  కనీ సం స్పందించకపోవడం నివ్వెర పరిచింది. ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అమెరికాకు మద్దతుగా నిలిచాయి.

ఇరాన్ పై దాడిని రష్యా, చైనా తీవ్రం గా ఖండించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే రెండు శిబిరాలుగా విడిపోతే మాత్రం అప్పుడు ట్రంప్ ఆపాలనుకున్నా యుద్ధం ఆగకపోవచ్చు. కాబట్టి వీలైనంత తొందరగా యుద్ధాన్ని విరమించుకొని శాంతిస్థాపన చర్చలకు ముందుకు వస్తే బాగుంటుంది.

 వ్యాసకర్త సెల్: 9866255355