6 May, 2026 | 3:59 AM

బీసీలకు రాజ్యాధికారం ఖాయం:జాజుల

06-05-2026 02:39 AM

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు బీసీలకు అనుకూలంగా ఉన్నాయని, నేపాల్‌లో జెన్ జీ ఉద్యమం, తమిళనా డులో టీవీకే పార్టీలు అధికారంలోకి దూసుకొచ్చాయని ఇలాంటి తరహాలోనే తెలంగాణలో కూడా మెజార్టీ ప్రజలైన బీసీలు ప్రయత్నిస్తే 2029లో రాజ్యాధికారం దక్కడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

మంగళవా రం నగరంలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. బీసీలకు దామాషా ప్రకారం వాటా దక్కడంలో కాంగ్రె స్, బీఆర్‌ఎస్, బీజేపీలు సామాజిక న్యా యం పాటించలేదని ఆరోపించారు. ఈ పార్టీలన్నీ మేకతోలు కప్పుకున్న తోడేళ్ల మందలు లాం టివని ఆగ్రహం వ్యక్తంచేశారు.

జూన్ రెండోవారంలో బీసీ విద్యార్థి రాజకీయ యుద్ధభేరి నిర్వహిస్తామని, జూలై 12న రాజకీయ ప్లీనరీ, ఆగస్ట్ 7న బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభ, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు బీసీల రథయాత్ర నిర్వహిస్తామని, డిసెంబర్‌లో పెరేడ్ గ్రౌండ్‌లో బీసీల రాజకీయ శంఖారావం బహిరంగ సభ నిర్వహిస్తామని జాజుల ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులలో, బడ్జెట్‌లో, రాజకీయ ప్రాతినిధ్యంలో 42 శాతం కల్పించకుండా అన్యాయం చేస్తుందని ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం అన్ని స్థాయి ల కమిటీలను రద్దు చేస్తున్నామని, త్వరలో  నూతన కమిటీలను నిర్మిస్తామని జాజుల ప్రకటించారు.