దివ్యాంగుల సంక్షేమ సంస్థలను బలోపేతం చేయాలి
వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.అంజయ్య గౌడ్
ముషీరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): తెలంగాణలో దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ, సంక్షేమ శాఖతో పాటు అనుబంధ సంస్థలను బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. అంజయ్య గౌడ్, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి. రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం హైదర్గూడలోని ఎన్‌ఎస్‌ఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సౌండ్ లైబ్రరీ, బ్రెయిల్ ప్రెస్, శిక్షణఉత్పత్తి కేంద్రాలు, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలను పునరుద్ధరించాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి బ్రెయిల్ ప్రెస్ను ఆధునీకరించాలని, వినికిడి పరికరాల తయారీ కేంద్రాన్ని పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్పీడబ్ల్యూడీ2016 చట్టం ప్రకారం ప్రత్యేక కమిషనర్ను నియమించాలని, దివ్యాంగుల సంక్షేమ శాఖలో అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ శాఖ కమిషనర్గా దివ్యాంగులనే నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి. వెంకట్ రాములు, ఎస్‌ఎన్ చారి, ఎస్. రాములు, బీసీ రాఘవన్, వంశీరాజ్ రామచందర్, జి. రమేష్, సైదులు యాదవ్, ఆర్. స్వామి నాయక్, విజయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.






