20 April, 2026 | 3:45 AM

ఐశ్వర్యం అక్షయం!

20-04-2026 01:59 AM
  1. భక్తి శ్రద్ధలతో మహిళల ప్రత్యేక పూజలు

సంప్రదాయ పూజా సామగ్రితో ఐశ్వర్యం కోరుకునే సంప్రదాయం

నేడు అక్షయ తృతీయ 

సీ విజయారాజం ఎండీ, విజయక్రాంతి :అక్షయ తృతీయను హిందువులు అత్యంత పుణ్యదినంగా భావి స్తారు. ఈ రోజు చేసే పూజలు, దా నాలు, సత్కార్యాలు అక్షయంగా ఫలిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వా సం. ముఖ్యంగా మహిళలు ఈ రోజు గౌరీదేవిని ఆరాధిస్తూ కుటుం బ శ్రేయస్సు, ఐశ్వర్యం, సౌభాగ్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంప్రదాయంగా ఇంటింటా మహిళలు పూజాసామగ్రిని సిద్ధం చేసుకుని ఆచార వ్యవహారాలతో వే డుకలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఈ రోజున బంగారం కొంటే ఐశ్వర్యం అక్షయమవుతుందని ఒక నమ్మకం. అయి తే, అక్షయ తృతీయ వెనుక ఉన్న అసలైన అర్థం కేవలం కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ ధ్యాత్మికంగా, సామాజికంగా ఈ తిథికి ఎంతో విశిష్టత ఉంది. ‘అక్షయం‘ అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. నేడు అక్షయ తృతీయ పం డుగ సందర్భంగా ప్రత్యేక కథనం. 

అక్షయ తృతీయ పూజకు అవసరమైన సామగ్రి

అక్షయ తృతీయ పూజకోసం మహిళలు ఈ క్రింది పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, చందనం, చీర ధాన్యాలు, బెల్లం, ఆకులు (6 రకా లు), అరటిపండ్లు, కొబ్బరికాయ, ఇతర పండ్లు, తాంబూలం, పత్తి, ఎండు ఖర్జూరాలు 9, తమలపాకులు 9, వక్కలు, కర్పూరం (హారతి కోసం)

పూజకు ముందుగా చేయాల్సిన ఏర్పాట్లు

అక్షయ తృతీయ రోజున మహిళలు తెల్లవారుజామునే లేచి స్నా నం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటి ముందు ముగ్గులు వేసి, పూజా స్థలాన్ని శుభ్రపరచాలి. అనంతరం దేవతా మండపాన్ని అలంకరించి కలశాన్ని ఏర్పాటు చేయాలి. కలశంపై కొబ్బరికాయ ఉంచి పసుపు, కుంకుమతో అలంకరించాలి.

పూజ విధానం ఇలా.. 

పూజ ప్రారంభంలో గౌరీదేవిని ఆహ్వానించి పసుపుతో గౌరీ రూపా న్ని తయారు చేయాలి. తర్వాత పసుపు, కుంకుమ, చందనం సమర్పించాలి. ధాన్యాలు, పండ్లు, తాం బూలం సమర్పిస్తూ కుటుంబ శ్రే యస్సు కోరుకోవాలి. తరువాత దీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేయాలి. అనంతరం కర్పూర హారతి ఇచ్చి పూజను ముగించాలి.

తాంబూలాలు ఇచ్చిపుచ్చు  సంప్రదాయం

అక్షయ తృతీయ రోజున మహిళలు పరస్పరం తాంబూలాలు ఇ చ్చిపుచ్చుకోవడం సంప్రదాయం. ఇది సౌభాగ్యం, ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వసిస్తారు. పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవడం కూడా ఈ రోజు ముఖ్య ఆచారం.

దానం చేస్తే అక్షయ పుణ్యం

మత్స్య పురాణం, విష్ణుధర్మోత్తర పురాణాల ప్రకారం, ఈ రోజున చేసే దానధర్మాలు అక్షయమవుతాయి. అక్షయ తృతీయ రోజున అన్నదానం, వస్త్రదానం, ధాన్యదానం చేయడం ద్వారా పుణ్యం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఈ సమయంలో ఇతరుల దాహం తీర్చడం, గొడుగులు, చెప్పులు దానం చేయడం విశేష ఫలితాన్నిస్తుంది.

జల పాత్రను దానం చేయ డం వల్ల అక్షయ కీర్తి లభిస్తుంది అని వేదవ్యాస మహర్షి తెలిపారు. స్వర్ణ దానం వల్ల కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా పేదలకు సహా యం చేయడం ద్వారా అక్షయ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ఉంది.  మహిళల భక్తి శ్రద్ధలకు ప్రతీకగా అక్షయ తృతీయ అక్షయ తృతీయ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో  కుటుంబ శ్రేయస్సు కోసం పూజలు చేస్తారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పూజ లు కుటుంబాల్లో ఆనందాన్ని నిం పుతాయి.