20 April, 2026 | 3:47 AM

రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు హోరాహోరీ

20-04-2026 01:57 AM

ఏకగ్రీవం అనుమానమే

కరీంనగర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలకు ఈసారి పోటీతప్పేలా లేదు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే పాలకవర్గ ఎన్నికలు ఈసారి ఆలస్యంగా జరుగుతుండడం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యుల్లో నెలకొన్న విబేధాలు, తదితర అంశాల కారణంగా ఈసారి ఏకగ్రీవం అనుమానంగానే ఉంది. 2026-28 నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి ముగ్గురు, 15 కార్యవర్గ స్థానాలకు 31 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది.

అయితే ఏకగ్రీవం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలితంచే విధంగా లేవు. గత పాలకవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న తొడుపునూరి కరుణాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నమనేని సుధాకర్ రావు, కె వెంకటయ్యలు అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతున్నారు. 15 కార్యవర్గ స్థానాలకు 31 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

నామినేషన్లు దాఖలు చేసిన వారిలో డి అశోక్ రావు, టి శివ, బుక్క శ్రీనివాస్, బోనగిరి కిరణ్, కె మల్లికార్జున్, బి తిరుపతి, కె వేణు మాధవరావు, ఎం రాజేశ్వర్ రెడ్డి, ఆర్ అమర్నాథ్, సాగి వీరభ ద్రరావు, సీహెచ్ అయిలయ్య, ఎం శ్రీనివాస్, క్యాస ఉపేందర్, ఎ తిరుపతి, జి శ్రీని వాస్, టి ప్రభాకర్, కె కేశవరెడ్డి, ఎల్ శ్రీధర్, బి మల్లన్న, పుల్లూరి శ్రీనివాస్, జి మల్లన్న, జి శ్రీనివాస్, వంగ జనార్ధన్, వీరకుమార్, ఎం జితేందర్లు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ 20 వరకు ఉండగా ఎన్నికలను ఈ నెల 26న నిర్వహిస్తారు.

ఇదే రోజు కౌం టింగ్ ఉంటుందని ఎన్నికల అధికారి పీవీ రామకృష్ణ ప్రకటించారు. మాజీ ప్రధాన కార్యదర్శి తొడుపునూరి కరుణాకర్, అన్నమనేని సుధాకర్ రావుల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. అసోసియేషన్ పెద్ద లు కొందరు, రాష్ట్ర మంత్రి ఒకరు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఒక అభ్యర్థికి కేంద్ర మంత్రి మద్దతు ఉండడంతో ఏకగ్రీవమయ్యే సూచనలు కనిపిం చడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత రైస్ మిల్లర్ అసోసియేషన్ ఎన్నికలతో వాతావరణం వేదెక్కింది. అసోసియేషన్ ఎన్నికలు జరిగితే విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.