30 May, 2026 | 2:38 AM

రైతులతో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం

30-05-2026 12:07 AM

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

నాగిరెడ్డిపేట్, మే 29 (విజయ క్రాంతి): మండలంలోని గోలి లింగాల,ఆత్మకూర్, జలాల్పూర్ గ్రామాలలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్థానిక బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి సోమవారం సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ...మండలంలోని గోలిలింగాల, జలాల్పూర్,ఆత్మకూర్ తదితర గ్రామాల్లో రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఆరబెట్టుకున్న వడ్లను ఇప్పటివరకు వేగవంతంగా కొనుగోలు చేయకుండా ఈఅసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని,

గత రెండు రోజుల్లో క్రితం కురిసిన వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్న పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే మదన్ రావును రైతుల పక్షాన హెచ్చరిస్తూ రాబోయే రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి,కన్నారెడ్డి, బంజారా తండా,ధర్మారెడ్డి, వాడి,గోపాల్పేట్ గ్రామాల సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, మహేందర్, గులపల్లి లక్ష్మీనారాయణ, సురేష్ సాయిలు, సీనియర్ రాజిరెడ్డి, నాయకులు పుప్పాల నారాయణ, ఫరీదు, లక్ష్మీకాంతం, నరేష్, మంగలి యాదగిరి,మోతే శ్రీనివాస్, జయరాజు, జితేందర్ రెడ్డి, విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.