18 April, 2026 | 4:36 AM

ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం

18-04-2026 12:16 AM

తాడ్వాయి,ఏప్రిల్, 17( విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని ప్రమాదాలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎల్లారెడ్డి రోడ్డుపై ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టడానికి ప్రతిపాదనలు రూపొందించారు.

శబరిమాత ఆశ్రమం నుంచి దేవాయపల్లి రోడ్డు వరకు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రతిపాదనలు రూపొందించి పై అధికారులకు పంపిస్తామని ఆయన తెలిపారు..ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ సిఐ, తాడ్వాయి ఎస్త్స్ర సిబ్బంది పాల్గొన్నారు.