18 April, 2026 | 6:18 AM

మంచినీటి చెరువు అక్రమ వినియోగంపై కఠిన హెచ్చరిక

18-04-2026 12:16 AM

ఇల్లందు టౌన్ ఏప్రిల్ 17 (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లందులపాడు మంచినీటి చెరువులో అక్రమ నీటి వినియోగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, కమిషనర్ గణేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చెరువు నీటిని అక్రమంగా మళ్లించడం, సహజ ప్రవాహాన్ని దెబ్బతీసే చర్యలను తప్పుపట్టారు. ప్రజల అవసరాల కోసం ఉన్న నీటి వనరులను వ్యక్తిగత లాభాల కోసం వినియోగించడం సహించబోమని హెచ్చరిస్తూ, ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి అక్రమ వినియోగం, అక్రమ విద్యుత్ కనెక్షన్లపై వెంటనే విచారణ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో AE నవీన్, వర్క్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, కౌన్సిలర్ సైదిమియా  పాల్గొన్నారు.