వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం
- ఈనెల 15 నాటికి అర్హులకు ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు
- ‘వెలుగుమట్ల’ భూముల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఇందిరమ్మ లబ్ధిదారులు
- సమగ్ర విచారణ జరిపించి పేదలకు న్యాయం చేస్తాం
- మంత్రి పొంగులేటి
ఖమ్మం, మార్చి 1 (విజయక్రాంతి): వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచా ర, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కలెక్టరేట్‌లో వెలుగుమట్ల బాధితులతో చర్చించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేసినట్లు తమకు సమాచారం వచ్చిందని, బాధితులు ఎవరికైనా డబ్బులు ఇస్తే తమకు సమాచారం అందించాలని చెప్పారు. వెలుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుతున్నారని, తాము ఈ అంశాన్ని కేవలం పేదల కోణంలోనే చూస్తున్నట్లు స్పష్టం చేశారు.
పేదలకు ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్యాయం జరిగే ప్రసక్తే ఉండదన్నారు. వెలుగుమట్ల ప్రభుత్వ భూదాన్ భూముల ఆక్రమణలో తప్పు ఒకరు చేస్తే, శిక్ష మరొకరికి పడినట్లు, కొంతమంది బాధితులు తెలి యక అక్కడ పట్టాలు పొందామనే భ్రమలో ఇండ్లు కట్టుకున్నారని మంత్రి తెలిపారు. వెలుగుమట్ల సంఘటనలో బాధితులు ఎప్పటినుంచి ఇక్కడ ఉంటున్నారు, ఆర్థిక పరిస్థి తులు ఎలా ఉన్నాయో అధికారులతో క్షుణ్ణం గా విచారణ చేయించి నిరుపేదలకు తప్పనిసరిగా న్యాయం చేస్తామన్నారు.
వెలుగు మట్ల భూదాన్ భూముల్లో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇందిరమ్మ ఇళ్లు తీసుకున్నవాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంద న్నారు. అటువంటి వారికి కాకుండా మిగిలిన అర్హులైన పేదలందరికీ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో, సంబంధిత బాధితుల సొంత ప్రాంతాల్లో ఇంటి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వెలుగుమట్ల సంఘటన బాధితులకు న్యాయం చేయడానికి తీసుకుంటు న్న చర్యలను మంత్రి వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు, వెలుగుమట్ల బాధితులు పాల్గొన్నారు.




